Astro Tips: ఉచితంగా వచ్చిన తీసుకోకూడని వస్తువులు ఇవే.. తీసుకున్నారో ఇక అంతే సంగతులు?

సాధారణంగా పల్లెటూర్లలో లేదంటే సిటీలలో ఇరుగుపొరుగు తెలిసిన వారు ఉంటే వస్తువులను ఇచ్చిపుచ్చుకోవడం

  • Written By:
  • Publish Date - December 30, 2022 / 06:00 AM IST

సాధారణంగా పల్లెటూర్లలో లేదంటే సిటీలలో ఇరుగుపొరుగు తెలిసిన వారు ఉంటే వస్తువులను ఇచ్చిపుచ్చుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు. అలాగే బంధువులలో స్నేహితులను తెలిసిన వారు ఉంటే కొన్ని రకాల వస్తువులను తీసుకుంటూ ఉంటారు. అయితే వస్తువులను దానం చేయడం లేదా తీసుకోవడం మంచిదే కానీ కొన్ని రకాల వస్తువులను ఉచితంగా వచ్చినా కూడా తీసుకోకూడదు. కొంతమంది వస్తువులు ఉచితంగానే వస్తున్నాయి కదా అని తీసుకుంటూ ఉంటారు. కానీ కొన్ని రకాల వస్తువులు తీసుకోవడం వల్ల ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి. అంతేకాకుండా అప్పుల పాలవుతారు.

ఒకవేళ మీకు ఎవరైనా ఉచితంగా కొన్ని రకాల వస్తువులను ఇచ్చినప్పుడు వాటిని ఫ్రీగా తీసుకునే బదులు ఎంతో కొంత చెల్లించే వాటిని తీసుకోవడం మంచిది. మరి ఆ వస్తువులు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఇనుము శని దేవునికి సంబంధించినది. కాబట్టి ఇనుమును ఎవరైనా ఉచితంగా ఇచ్చినా కూడా తీసుకోకూడదు. అలాగే శనివారం రోజుల్లో ఇనుము వస్తువులను కొనుగోలు చేయకూడదు. హ్యాండ్ కర్చీఫ్ ఎవరైనా ఉచితంగా ఇస్తున్న బహుమతిగా ఇస్తున్న తీసుకోకూడదు. ఒకవేళ అటువంటి వాటిని తీసుకున్న కూడా వేరే వాళ్లకు దానం చేయడం మంచిది. కర్చీప్ ఉచితంగా తీసుకోవడం వల్ల అది పరస్పర సంబంధాలను బలహీనపరుస్తుంది. అలాగే ఉప్పును కూడా ఉచితంగా ఎవరి దగ్గర నుంచి తీసుకోకూడదు. ఉప్పు ఉచితంగా తీసుకున్నప్పటికీ మళ్లీ వెనక్కి తిరిగి ఇచ్చేయడం మంచిది.

ఒకవేళ ఉప్పుకు డబ్బు చెల్లించలేని పరిస్థితిలో ఉంటే దానికి బదులుగా మరొక వస్తువును తిరిగి ఇవ్వాలి. కానీ ఉప్పును మాత్రం ఎట్టి పరిస్థితులలో ఫ్రీగా తీసుకోకూడదు. ఉప్పు నేరుగా శని దేవునితో సంబంధం కలిగి ఉంటుంది కాబట్టి దాన్ని తీసుకోవడం వల్ల శని చెడు ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. నాకు ఆవ నూనె ను ఎవరి దగ్గర నుంచి అప్పుగా కానీ ఉచితంగా కానీ తీసుకోకూడదు. అప్పుగా తీసుకొని మరిచిపోకూడదు తిరిగి ఇచ్చేయాలి. ఆవనూనె కూడా శని దేవునికి సంబంధించినది కాబట్టి శని దేవుడు చెడు ప్రభావాన్ని చూపవచ్చు. సూది ,దారం ఉచితంగా లేదంటే బదులుగా తీసుకోకూడదు. విధంగా తీసుకోవడం వల్ల జీవితంలో సమస్యలు పెరిగి కలహాలు కష్టాలు మొదలవుతాయి .