Puja Room at Home: ఇంట్లో పూజ గదిలో ఈ నాలుగు వస్తువులు ఉంటే అంతే సంగతులు?

సాధారణంగా పూజ గదిలో ఎన్నో రకాల వస్తువులు విగ్రహాలు, దేవుడి ఫోటోలను పెట్టుకుంటూ ఉంటారు. ఇంట్లో

  • Written By:
  • Publish Date - January 10, 2023 / 06:00 AM IST

సాధారణంగా పూజ గదిలో ఎన్నో రకాల వస్తువులు విగ్రహాలు, దేవుడి ఫోటోలను పెట్టుకుంటూ ఉంటారు. ఇంట్లో సానుకూల శక్తి ప్రవాహం పూజ గది నుండి ప్రవహిస్తుంది. కాబట్టి పూజ గది విషయంలో జాగ్రత్తగా ఉండడంతో పాటు తెలిసి తెలియక కూడా కొన్ని రకాల పొరపాట్లను అస్సలు చేయకూడదు. కొంతమంది తెలియక కొన్ని వస్తువులను పూజ గదిలో ఉంచుతూ ఉంటారు. తద్వారా దేవుడికి కోపం వస్తుంది. మరి పూజ గదిలో ఎటువంటి వస్తువులు ఉంచాలి ఎటువంటి మంచి వస్తువులు ఉంచకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. చాలామంది ఇళ్లలో పూజ గదిలో ఒకటి కంటే ఎక్కువ దేవుని విగ్రహాలను పెడుతూ ఉంటారు. మత గ్రంథాలలో దానిని తప్పుగా పరిగణించబడుతుంది.

పూజ గదిలో ఒకటి కంటే ఎక్కువ దేవుని విగ్రహాలను ఉంచకూడదు. అలాగే పూజ గదిలో ఎప్పుడూ పరమశివుడు సౌమ్యంగా ఉన్న విగ్రహం లేదా పటాన్ని మాత్రమే ఉంచాలి. శివుడు ఉగ్రరూపంతో ఉన్న ఫోటోని కానీ విగ్రహాన్ని కానీ పెట్టుకోకూడదు. కేవలం శివుడు మాత్రమే కాకుండా ఇతర దేవత లేదా దేవుడు కోపంతో కనిపిస్తున్న ఫోటోలను పూజ గదిలో పెట్టుకోవడం వల్ల అది ఇంట్లో అసమ్మతికి కారణం అవుతుంది. అలాగే పూజ గదిలో నటరాజు రూపంలో ఉన్న హనుమంతుడు, భోలేనాథ్ పటాలను ఇంట్లో ఉంచకూడదు. చాలామంది చేసే పెద్ద పొరపాటు ఏమిటంటే విరిగిన విగ్రహాలు లేదంటే విరిగిన ఫోటోలను అలాగే దేవుడు గదిలో ఉంచుకుంటూ ఉంటారు.

కానీ అలా చేయకూడదు. పూజ గదిలో విరిగిన విగ్రహం లేదంటే పటం ఉంటే వెంటనే వాటిని తీసివేసి ఏదైనా మంచి ప్రదేశంలో పెట్టేయాలి. విరిగిన విగ్రహాలు, పటాలకు పూజలు చేయడం వల్ల ప్రతికూల ఫలితాలు వస్తాయి. చాలామంది చనిపోయిన వారు దేవునితో సమానం అని చెప్పి పూజ గదిలో పూర్వీకుల చిత్రపటాలను దేవుడు గదిలో పెడుతూ ఉంటారు. అలా ఎప్పటికీ చేయకూడదు. పూజ గదిలో పూర్వీకుల చిత్రపటాలను ఉంచడం వల్ల ఇంటి శ్రేయస్సు, ఆనందానికి ఆటంకాలు ఏర్పడతాయి.