Site icon HashtagU Telugu

Bride: నవవధువుకి పొరపాటున కూడా అలాంటి గిఫ్టులు అస్సలు ఇవ్వకండి.. ఇచ్చారో.. జీవితం నాశనం అవ్వాల్సిందే!

Bride

Bride

మామూలుగా కొత్తగా పెళ్లయిన కూతురికి గిఫ్టులు ఇవ్వడం అన్నది సహజం. చిన్న చిన్న గిఫ్ట్ నుంచి బంగారు వరకు ఇస్తూ ఉంటారు. అయితే ఇలా గిఫ్ట్లు ఇచ్చే విషయంలో వధువు వరులకు తెలిసి తెలియక చాలా మంది రకరకాల పిచ్చి పిచ్చి కానుకలు ఇస్తూ ఉంటారు. అయితే ఇలా అసలు చేయకూడదని చెబుతున్నారు. ముఖ్యంగా పుట్టింటి నుంచి తల్లి కూతురికి కొన్ని రకాల వస్తువులను అస్సలు పంపించకూడదని చెబుతున్నారు. ఎందుకంటే కొత్తగా పెళ్లి అయిన కూతురికి కొన్ని రకాల గిఫ్ట్లు ఇవ్వడం వల్ల అనేక సమస్యలు వస్తాయట. ఇది ఆమె వైవాహిక జీవితంలో సమస్యలను తెచ్చిపెడుతుందని చెబుతున్నారు. మరి పెళ్లి అయిన నవ వధువుకి ఎలాంటి గిఫ్ట్ లు ఇవ్వకూడదు అన్న విషయానికి వస్తే..

వాస్తు శాస్త్ర ప్రకారం పెళ్లి అయిన కూతురికి కొన్ని వస్తువులను దానం చేయడం వల్ల సంబంధాలు తెగిపోవడం, ఆర్థిక సమస్యలు, మానసిక ఒత్తిడి వంటి సమస్యలు వస్తాయట. కాబట్టి ఈ విషయంపై అదనపు శ్రద్ధ చూపడం ముఖ్యం. పెళ్లైన కూతురికి బహుమతులు ఇచ్చేటప్పుడు నివారించాల్సిన మూడు విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. వివాహిత కుమార్తెకు గాజు వస్తువులను బహుమతిగా ఇవ్వడం వల్ల ఆమె జీవితంలో ఆర్థిక సమస్యలు తలెత్తవచ్చట. గాజును దుర్బలత్వం, అస్థిరతకు చిహ్నంగా భావిస్తారని, దీని వల్ల జీవితంలో స్థిరత్వం లోపించవచ్చని చెబుతున్నారు. అలాగే గాజు సామాను పగిలిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది ఆర్థిక సమస్యలు, సంబంధాల విచ్ఛిన్నతను సూచిస్తుందని పండితులు చెబుతున్నారు. అలాగే ఊరగాయ రుచికి పుల్లగా, ఉప్పగా ఉంటుంది.

ఈ బహుమతులు సంబంధంలో పుల్లని రుచికి చిహ్నంగా పరిగణించబడతాయట. మీ పెళ్లైన కూతురికి ఊరగాయలు బహుమతిగా ఇస్తే అత్తమామలతో వివాదాలు కూడా వస్తాయట. దీనికి బదులుగా, స్వీట్లు లేదా బెల్లం వంటి స్వీట్లను అందించడం శుభప్రదంగా పరిగణించబడుతుందని చెబుతున్నారు. అలాగే నలుపు రంగు ప్రతికూల శక్తిని ఆకర్షిస్తుంది. వివాహం తర్వాత ఒక అమ్మాయికి నల్లటి దుస్తులు బహుమతిగా ఇవ్వడం వల్ల ఆమె వైవాహిక జీవితంలో సమస్యలు వస్తాయని, భార్యా భర్తల మధ్య దూరం పెరిగి కుటుంబ సంబంధాలు బలహీనపడవచ్చని చెబుతున్నారు. కాబట్టి పెళ్లి అయినా మీ కూతురికి పైన చెప్పిన ఈ మూడు రకాల వస్తువులు ఇవ్వకపోవడమే మంచిది అని చెబుతున్నారు.