Site icon HashtagU Telugu

Lakshmi Devi: పొరపాటున కూడా ఈ పనులు అస్సలు చేయకండి.. చేశారో లక్ష్మీ ఆగ్రహానికి గురై వెళ్ళిపోతుందట?

Monday

Monday

లక్ష్మీ అనుగ్రహం కలగాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటూ ఉంటారు. అమ్మవారి అనుగ్రహం కోసం ఎన్నెన్నో పూజలు పరిహారాలు, దానధర్మాలు వంటివి కూడా చేస్తూ ఉంటారు. అయితే వీటితో పాటుగా చాలామంది తెలిసి తెలియక చేసే చిన్న చిన్న పొరపాట్లు కారణంగా అమ్మవారి అనుగ్రహం కలిగినా కూడా కోపం వచ్చి అమ్మవారి ఇల్లు వదిలి వెళ్ళిపోతుందట. మరి లక్ష్మీదేవికి కోపం తెప్పించే ఆ పనులు ఏంటి? ఎలాంటి పొరపాట్లు చేయకూడదు అన్న విషయానికి వస్తే.. మామూలుగా చీపురులో లక్ష్మీదేవి నివసిస్తుందని నమ్ముతూ ఉంటారు. కాబట్టి సూర్యాస్తమయం తరువాత ఇంటిని ఊడ్చడం వల్ల అమ్మవారి ఆశీర్వాదాలు తొలగిపోతాయట. కాబట్టి సూర్యాస్తమయం తరువాత ఎట్టి పరిస్థితులలో చీపురుతో ఊడ్చకూడదని చెబుతున్నారు. ఒకవేళ ఇల్లు శుభ్రం చేసినా కూడా ఆ చెత్తను బయట పడేయకూడదని చెబుతున్నారు.

అలాగే ఎప్పుడు కూడా సూర్యా స్తమయం తర్వాత పాలు, పెరుగు, చక్కెర, ఉప్పు అప్పుగా ఇవ్వడం వల్ల ఆర్థిక నష్టం జరుగుతుందట. అదేవిధంగా చీపురును ఎప్పుడూ కూడా వంచకూడదట. అలాగే శుభ్రం చేయడానికి కూడా ఎవ్వరికీ చీపురు ఇవ్వకూడదని ఎందుకంటే లక్ష్మీ దేవి అందులో నివసిస్తుందని చెబుతున్నారు. సూర్యోదయం, సూర్యాస్తమయం సమయంలో నిద్రపోకూడదట. చాలామంది చేసే అతిపెద్ద తప్పు ఇదే. ఎందుకంటె ఈ సమయాలు పూజకు ఉత్తమమైనవిగా భావిస్తారు. ఈ సమయంలో నిద్రపోవడం వల్ల సోమరితనం పెరుగుతుందట. లక్ష్మీదేవికి అసంతృప్తి కలిగి లక్ష్మీ దేవి ఇల్లు వదిలి వెళ్ళిపోతుందట. అయితే ఆరోగ్యం బాగోలేని వారికి చిన్న పిల్లలకు ఈ విషయం వర్తించదని చెబుతున్నారు.

అదేవిధంగా ఇంటికి వచ్చిన అతిథులను అవమానించడ వల్ల లక్ష్మీదేవికి కోపం వస్తుందట. అలాగే రాత్రిళ్ళు మురికి పాత్రలను రాత్రంతా శుభ్రం చేయకుండా అలాగే సింక్ లో పడేసి ఉంచడం వల్ల నెగిటివ్ ఎనర్జీ పెరుగుతుందట. దీంతో సంపద నష్టం జరుగుతుందట. కాబట్టి రాత్రిపూట మాత్రమే పాత్రలను శుభ్రం చేయడం అలవాటు చేసుకోవాలట. అలాగే ఇంట్లో ఎప్పుడూ పరిశుభ్రత పాటించాలట. ఉత్తర దిశలో అశుభ్రంగా ఉంచకూడదట. ఎందుకంటె ఈ దిశ సంపదకు అధిపతి అయిన కుబేరుడికి సంబంధించినది అని చెబుతున్నారు. అలాగే రాత్రి పెరుగు తినడం కూడా లక్ష్మీదేవికి అస్సలు ఇష్టం ఉండదట. లక్ష్మీ దేవిని పూజించటప్పుడు ఆమెతో పాటు విష్ణువును కూడా పూజించాలని, వారిని లక్ష్మీ నారాయణ్ అని పిలుస్తారని, విష్ణుమూర్తి లేకుండా లక్ష్మీ దేవి ఆశీస్సులు పొందలేము అని చెబుతున్నారు.