Eating Rules: కంచంలో చేయి కడుక్కుంటున్నారా.. అయితే ఆ సమస్యలు తప్పవు?

మామూలుగా మనం భోజనం చేసిన తర్వాత చాలావరకు చేతులను కంచంలోనే కడుక్కుంటూ ఉంటాం. పెద్దపెద్ద ఇళ్లలో అయితే భోజనం చేసిన తర్వాత సింక్ లో

  • Written By:
  • Publish Date - December 21, 2023 / 06:35 PM IST

మామూలుగా మనం భోజనం చేసిన తర్వాత చాలావరకు చేతులను కంచంలోనే కడుక్కుంటూ ఉంటాం. పెద్దపెద్ద ఇళ్లలో అయితే భోజనం చేసిన తర్వాత సింక్ లో చేతిని కడుక్కుంటూ ఉంటారు. చాలామంది దానిని ఫాషన్ అనుకుంటారు. కానీ అలా తిన్న ప్లేట్ లో చేతులు కడగరాదు అని పండితులు కూడా చెబుతున్నారు. మరి ప్లేటులో చేతిలో ఎందుకు కడుక్కోకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. చాలా మంది భోజ‌నం తర్వాత తిన్న కంచంలోనే చేతులు కడుక్కోవడం మీరు గమనించి ఉంటారు. మనం ఈ తప్పు చేస్తే ఆహార నియమాలను ఉల్లంఘించినట్లే, తినే ఆహారాన్ని అవమానించినట్లే.

ఇలా చేయడం వల్ల ఆహారం గౌర‌వం పోవడమే కాకుండా భవిష్యత్తులో దాని దుష్పరిణామాలను కూడా ఎదుర్కోవాల్సి రావచ్చు. కంచంలో చేతులు కడుక్కోవడానికి బదులుగా, సింక్ వద్ద లేదా మ‌రో ప్రాంతంలో చేతులు కడుక్కోవాలి. దీనికి సంబంధించిన మరో అంశం ఏమిటంటే, తిన్న తర్వాత కంచం అలా వ‌దిలేయ‌కూడ‌దు. భోజనం చేసిన వెంటనే కడిగి శుభ్రం చేయాలి. అన్న పూర్ణాదేవి ఆహారానికి అధి దేవత. ఆవిడ అనుగ్రహం వల్లనే మనకు ఆహారం లభిస్తుంది. కాబట్టి భోజనం చేసే ముందు ఒకసారి ఆమెను స్మరించుకోవాలి. తిన్న తర్వాత అదే ప్లేటులో చేతులు కడుక్కోవడం అన్నపూర్ణా దేవిని అవమానించినట్లే. అన్నపూర్ణ దేవి మరెవరో కాదు, సాక్షాత్తూ మహాలక్ష్మి స్వ‌రూపం.

అన్నపూర్ణా దేవిని అవమానించే వ్యక్తి ఎప్పుడూ పేదరికాన్ని ఎదుర్కొంటాడు. జ్యోతిష్యం ప్రకారం మనం మన దైనందిన జీవితంలో తెలిసి లేదా తెలియక అనేక తప్పులు చేస్తుంటాము. వాటిలో ఒకటి తిన్న కంచంలో చేతులు కడుక్కోవడం. చాలా మంది ప్రతిరోజూ ఇలాంటి తప్పులు చేస్తుంటారు. అందుకే వారు జీవితంలో అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటారు. జ్యోతిష్యుల అభిప్రాయం ప్రకారం, గ్రహాలు కూడా అతనికి వ్యతిరేకంగా సంచ‌రిస్తాయి. ఆహారం తిన్న కంచంలో చేతులు కడుక్కోవడం ద్వారా ఆ వ్యక్తికి అశుభ ఫలితాలు ఇవ్వడం ప్రారంభిస్తాయి. దాని అత్యంత ప్రతికూల ప్రభావం ఒక వ్యక్తి ఆరోగ్యంపై ఉంటుంది. అందుకే తిన్న కంచంలో చేతులు కడుక్కోవడం మానుకోవాలి. తిన్న కంచంలో చేతులు కడుక్కునే వ్యక్తి పేదరికానికి గురవుతాడు. అలాంటి వ్యక్తులు జీవితంలో డబ్బు సమస్యలతో పాటు ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటారు.