Tulasi Plant: తులసి మొక్కకు నీరు పోస్తున్నారా.. పొరపాటున కూడా ఈ 4 తప్పులు అస్సలు చేయకండి?

హిందువులు తులసి మొక్కను పవిత్రంగా భావించడంతోపాటు దేవతగా భావించి నిత్య పూజలు చేస్తూ ఉంటారు. తులసి మొక్కను పూజించడం వల్ల ఎన్నో రకాల సమస్యలను

  • Written By:
  • Publish Date - July 28, 2023 / 08:00 PM IST

హిందువులు తులసి మొక్కను పవిత్రంగా భావించడంతోపాటు దేవతగా భావించి నిత్య పూజలు చేస్తూ ఉంటారు. తులసి మొక్కను పూజించడం వల్ల ఎన్నో రకాల సమస్యలను దూరం చేసుకోవచ్చు. ఆర్థికంగా కూడా లాభాలు చేకూరుతాయి. పూర్వం నుంచి ఆయుర్వేదంలో తులసి మొక్కను ఉపయోగిస్తున్న విషయం తెలిసిందే. తులసి మొక్క వల్ల ఆరోగ్యపరంగానే కాకుండా ఆధ్యాత్మికంగా కూడా ఎన్నో లాభాలు ఉన్నాయి. అయితే కొంతమంది తెలిసి తెలియక తులసి మొక్క విషయంలో కొన్ని రకాల తప్పులు చేస్తూ ఉంటారు. వాటి వల్ల అనేక రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

ముఖ్యంగా కొందరు తులసి మొక్కకు నీరు పోసేటప్పుడు నాలుగు రకాల తప్పులు అస్సలు చేయకండి అంటున్నారు పండితులు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఎప్పుడు కూడా స్నానం చేయకుండా ఏదైనా తిన్న తర్వాత తులసి మొక్కకు నీరు సమర్పించకూడదు. అలాచేస్తే ఆమెకు కోపం వస్తుంది. దీని వల్ల మీ ఇంట్లో దుఃఖం , పేదరికం వ్యాపిస్తుంది. అలాగే మత విశ్వాసాల ప్రకారం, మీరు తులసికి నీటిని సమర్పించినప్పుడల్లా, కుట్టిన బట్టలు ధరించకూడదని అన్న విషయాన్నీ గుర్తుంచుకోవాలి. అంటే కుట్టని వస్త్రాన్ని ధరించి తులసికి నీరు సమర్పించాలి. అలాగే ఆది, బుధవారాల్లో పొరపాటున కూడా తులసి మాతకు నీరు సమర్పించకూడదు.

కొంతమంది ఆదివారం మాత్రమే పోయకుండా మిగిలిన రోజులలో తులసి మొక్కకు నీరు పోస్తూ ఉంటారు. కానీ ఆది బుధవారాల్లో తులసి మొక్కకు నీరు పోయకూడదు. ఎందుకంటే ఈ రోజున తులసి దేవి విశ్రాంతి తీసుకుంటుందట. ఈ రోజున నీటిని సమర్పిస్తే తులసి దేవికి కోపం వస్తుందట. అదేవిధంగా ఏకాదశి రోజు కూడా తులసి మొక్కకు నీరు పోయకూడదు. ఎందుకంటే ఏకాదశి రోజున, తులసి మాత విష్ణువు కోసం నీరు లేని ఉపవాసం ఉంటుంది. దీంతో పాటు తులసి మొక్కలో నీరు ఎక్కువగా పోకుండా ప్రత్యేక శ్రద్ధ వహించండి. ఇది అననుకూలంగా భావించే మొక్కను పాడుచేయవచ్చు. సూర్యోదయం సమయంలో తులసి మొక్కకు నీటిని సమర్పించడం ఎల్లప్పుడూ శుభప్రదంగా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఇలా చేయడం వల్ల మీ పనులన్నీ ఎలాంటి ఆటంకాలు లేకుండా జరుగుతాయి.