జ్యోతిషశాస్త్రంలో అంగారక గ్రహాన్ని హానికరమైన గ్రహంగా భావిస్తారు. ఒకరి జాతకంలో బలహీనమైన స్థితిలో ఉన్న మార్స్, జీవితంలో ఆ వ్యక్తికి ఎప్పుడూ కష్టాలను తెస్తుందని చెబుతుంటారు. కాగా మంగళవారం, అంగారకుడి చెడులను నివారించడానికి హనుమంతుడిని పూజించవచ్చని చెబుతారు. హనుమంతుడు మాత్రమే ఒక వ్యక్తిని గ్రహాల చెడుల నుండి రక్షించగలడని పండితులు చెబుతున్నారు. అంగారకుడు,శని, రాహు, కేతు వంటి పాపపు గ్రహాల వల్ల కలిగే చెడు ప్రభావాలను నివారించడానికి హనుమంతుడిని ఆరాధించడం చాలా ప్రయోజనకరం అని చెబుతున్నారు. వారంలో మంగళవారం రోజు హనుమంతుడికి అంకితం చేయబడింది.
మరి ఈ మంగళవారం రోజున హనుమంతుని భక్తిశ్రద్ధలతో పూజించడంతోపాటు కొన్ని రకాల పనులు చేయకపోవడం మంచిదని చెబుతున్నారు. మరి మంగళవారం రోజు పొరపాటున కూడా ఎలాంటి పనులు చేయకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మంగళవారం సౌందర్య సాధనాలను కొనడం వైవాహిక సంబంధాన్ని ఛిద్రం చేస్తుందని అంటారు. ఒకవేళ , మీరు సౌందర్య సాధనాలను కొనాలనుకుంటే సోమ, శుక్ర వారాలను ఉత్తమమైన రోజులుగా చెప్పవచ్చు. అదేవిధంగా మంగళవారం రోజున పొరపాటున కూడా సేవింగ్ గోర్లు కత్తిరించడం లాంటివీ అస్సలు చేయకూడదు. మంగళవారం గోర్లు కత్తిరించడం అవమానకరంగా భావిస్తారు.
దీన్ని చేయడంలో మీరు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. అదేవిధంగా మంగళవారం రోజున సోదరీమణులు అన్నయ్యలతో గొడవ పడకూడదట. సోదరుడితో వివాదం జాతకంలో మార్స్ ను ప్రభావితం చేస్తుందని చెబుతున్నారు. ఇలా గొడవపడితే అది వాహన ప్రమాదాలు అలాగే ఇతర సమస్యలకు దారి తీయవచ్చు అని చెబుతున్నారు. మంగళవారం రోజు ఎప్పుడు కూడా ముదురు రంగు దుస్తులు కొనుగోలు చేయడం ధరించడం లాంటివి చేయకూడదట. ఇంకా చెప్పాలంటే ఈ రోజున ఎర్ర బట్టలు ధరించడం చాలా మంచిదని చెబుతున్నారు.
అంగారకుడిని భూమి కొడుకుగా భావిస్తారు. ఈ రోజున భూమిని తవ్వవద్దు. ఇలా చేయడం వల్ల అంగారక గ్రహానికి నష్టం పెరుగుతుంది. మంగళవారం తలుపు తట్టడం కూడా శుభంగా పరిగణించబడదు. అలాగే మంగళవారం రోజు పదునైన వస్తువులు కొనుగోలు చేయకూడదు. మాంసం తినకూడదట. ఉపవాసం ఉన్నవారు ఉప్పును అస్సలు తినకూడదని చెబుతున్నారు. మంగళవారం ఇంట్లో మాంసం ఉడికించకూడం లేదా తినడం లాంటివి చేయకూడదట. పొరపాటున కూడా మంగళవారం రోజు ఎవరితో అప్పు చేయకూడదు.
note: పైన సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించబడినది. ఇవి పాటించడం అన్నది మీ వ్యక్తిగత మాత్రమే.