Site icon HashtagU Telugu

Sunday: పొరపాటున కూడా ఆదివారం రోజు ఈ పనులు అస్సలు చేయకండి!

Sunday

Sunday

ఆదివారం రోజు కొన్ని పనులు చేయడం నిషేధించబడిందట. ముఖ్యంగా కొన్ని రకాల పనులు చేయడం అసలు మంచిది కాదని చెబుతున్నారు పండితులు. ఈ రోజున తెలిసి తెలియక చేసే కొన్ని చిన్న చిన్న తప్పుల వల్ల సూర్య భగవానుని ఆగ్రహానికి గురవక తప్పదు అని అంటున్నారు. మరి ఆదివారం రోజు ఎలాంటి పనులు చేయకూడదు అన్న విషయానికి వస్తే.. ఆదివారం రోజు నలుపు లేదా నీలం బూడిద రంగు దుస్తులను ధరించకూడదట. ఆదివారాన్ని సూర్య భగవానుని రోజుగా పరిగణిస్తారు. కాబట్టి ఈ రోజున గులాబీ బంగారం అలాగే నారింజ రంగు దుస్తులను మాత్రమే ధరించడం మంచిదని చెబుతున్నారు.

ఆదివారం రోజు జుట్టు, గోళ్లు కత్తిరించకూడదట. చాలావరకు చాలామంది ఆదివారం రోజే జుట్టు గోర్లను కత్తిరించాలనీ అనుకుంటూ ఉంటారు. ఆవాల నూనెను జుట్టుకు అప్లై చేయడం లేదంటే జుట్టును మసాజ్ చేసుకోవడం లాంటివి కూడా చేయకూడదని చెబుతున్నారు. అదేవిధంగా ఆదివారం రోజు పొరపాటున కూడా మాంసము, చేపలు, మధ్యం తినకూడదు అని చెబుతారు. అలా చేయటం వలన సూర్య భగవానుడి ఆగ్రహానికి గురవక తప్పదు అని అంటున్నారు. ఆదివారం రోజు ఎరుపు రంగులో ఉండే కాయగూరలు అనగా బచ్చలకూర వెల్లుల్లి ఉల్లిపాయలు వంటివి ఉపయోగించకపోవడమే మంచిది అని చెబుతున్నారు.

రాగికి వాస్తు దోషాలను పోగొట్టే శక్తి ఉంది ఇది మీ ఇంటి వాతావరణం ప్రశాంతంగా మారుస్తుంది. మీ కీర్తికి ప్రతిష్టలు తీసుకొస్తుంది. అందుకే ఆదివారం రోజు రాగి వస్తువులను మార్పిడి చేయకూడదని చెబుతున్నారు. అలాగే రాగితో తయారుచేసిన వస్తువులను ఆదివారం రోజు కొనుగోలు చేయడం విక్రయించడం లాంటివి అస్సలు చేయకూడదట. సూర్య భగవానుడిని ప్రసన్నం చేసుకోవటానికి ప్రతి ఆదివారం ఉపవాసం ఉండటం మంచిది. సూర్యోదయం సమయంలో గాయత్రి మంత్రం పఠించి సూర్యునికి నీరు అర్పించాలి. ఆదివారం నుండి ప్రతిరోజు 108 సార్లు సూర్య మంత్రాన్ని జపించాలి. ప్రతిరోజు ఉదయాన్నే సూర్య నమస్కారం చేయడం మంచిదని చెబుతున్నారు. అలాగే ఉదయం పూట నీళ్లు తాగటానికి రాగి పాత్రను ఉపయోగించాలట. ఈ విధంగా చేయడం వలన సూర్య భగవానుడు ప్రసన్నమవుతాడట.