Site icon HashtagU Telugu

Vasthu Tips: నిద్ర లేవగానే పొరపాటున కూడా ఈ మూడింటిని అస్సలు చూడకండి.. చూసారో దరిద్రమే!

Mixcollage 08 Jul 2024 07 17 Pm 46

Mixcollage 08 Jul 2024 07 17 Pm 46

మామూలుగా చాలా మంది ఉదయం నిద్ర లేవగానే తెలిసి తెలియక కొన్ని కొన్ని చిన్న చిన్న తప్పులు చేస్తూ ఉంటారు. వాటి వల్ల అనేక రకాల ఇబ్బందులు కూడా ఎదుర్కొంటూ ఉంటారు. మనం చేసే ఆ చిన్న చిన్న పొరపాట్లు మనల్ని రోజంతా ప్రశాంతంగా ఉండనీయకుండా చేస్తాయి. ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ఉదయం లేచిన వెంటనే మూడు రకాల వస్తువులను అసలు చూడకూడదు అంటున్నారు పండితులు. ఇంతకీ ఆ వస్తువులు ఏంటి?ఆ వస్తువులను చూస్తే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. కాగా వాస్తు శాస్త్రంలో ఉదయం లేవగానే మనం చూడకూడని వస్తువులు కొన్ని ఉన్నాయి.

ఉదయం నిద్రలేచిన తర్వాత వీటిని చూడటం వల్ల అశుభ ఫలితాలు వస్తాయట. అంతేకాకుండా అవి మనకు ఆర్థిక సమస్యలు వచ్చేలా కూడా చేస్తాయట. అలా ఉదయం లేవగానే చూడకూడని వాటిలో నీడ కూడా ఒకటి. ఉదయం నిద్రలేవగానే మీ నీడను లేదా వేరేవాళ్ల నీడలను పొరపాటున కూడా చూడకూడదు. సూర్య దర్శన సమయంలో పడమటి దిశలో ఉన్న నీడను చూడటం అశుభంగా భావిస్తారు. దీనివల్ల అంతా చెడే జరుగుతుందట. అలాగే ఉదయం నిద్ర లేవగానే చాలామంది స్త్రీలు నేరుగా వంటింట్లోకి వెళ్లి రాత్రి ఉన్న ఎంగిలి పాత్రలను మురికి పాత్రలను చూస్తూ ఉంటారు. కానీ అలా అస్సలు చేయకూడదు.

అందుకే రాత్రిపూట తిన్న వెంటనే పాత్రను శుభ్రం చేసి పడుకోవడం వల్ల అన్నపూర్ణాదేవి అనుగ్రహం లభించడంతోపాటు ఇంట్లోకి కూడా నెగటివ్ ఎనర్జీ ప్రవేశించదు. ఇంకొందరికి ఉన్న అతిపెద్ద చెట్ట అలవాటు ఉదయం లేవగానే వారి ముఖాలను వారి అద్దంలో చూసుకుంటూ ఉంటారు. కానీ వాస్తు శాస్త్రం ప్రకారం ఇలా అస్సలు చేయకూడదట. ఎందుకంటే ప్రతికూల శక్తులన్నీ మీలోకి ప్రవేశిస్తాయి. దీంతో మీ రోజు ఉత్సాహంగా ఉండదు. పనులు ముందుకు సాగవు. అలాగే మిమ్మల్ని పేదరికం వెంటాడుతుంది. పైన చెప్పిన మూడు పనులు చేయడం వల్ల దరిద్రం కూడా వెంటాడుతుంది అంటున్నారు పండితులు.