Site icon HashtagU Telugu

Lakshmi Devi: రాత్రిపూట ఇలాంటి పనులు చేస్తున్నారా… అయితే లక్ష్మీ ఇల్లు వదిలి వెళ్ళిపోవడం ఖాయం!

Varalaxmi Vratham 2023

Lakshmi Devi

మనం చేసే చిన్న చిన్న పొరపాట్లు మనం ఎదుర్కొనే ఎన్నో రకాల సమస్యలకు కారణం కావచ్చు అని చెబుతున్నారు పండితులు. అలాగే లక్ష్మీ అనుగ్రహం కలగకపోవడానికి కూడా కారణం కావచ్చు అని చెబుతున్నారు. అయితే లక్ష్మీ అనుగ్రహం కలగాలి అనుకున్న వారు లక్ష్మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చోవాలి అనుకున్న వారు రాత్రి సమయంలో కొన్ని రకాల పనులు అస్సలు చేయకూడదట. అలా చేస్తే లక్ష్మీదేవికి కోపం వచ్చి ఇల్లు వదిలి వెళ్ళిపోతుంది అని చెబుతున్నారు. మరి ఈ రాత్రి పూట ఎలాంటి పనులు చేయకూడదు అన్న విషయానికి వస్తే.. సాయంత్రం పూట గోళ్లు కట్ చేయకూడదని ఇంట్లో అమ్మమ్మలు, అమ్మా నాన్నలు చెప్పడం వింటూనే ఉంటాం.

కానీ నేటి తరంలో చాలా మంది దీనిని ఏమాత్రం గౌరవించరు. ఇందులో తప్పు లేదని భావిస్తుంటారు. అవన్నీ మూఢనమ్మకాలు అని కొట్టి పారేస్తూ ఉంటారు. అయితే రాత్రిపూట పొరపాటున కూడా గోర్లు కత్తిరించకూడదని చెబుతున్నారు. సూర్యాస్తమయం తర్వాత రాత్రిపూట స్త్రీలు లేదా పురుషులు తమ గోళ్లను కత్తిరించకూడదు. అలా కట్ చేస్తే ఇంటికి అందం వస్తుంది. ఇంటి పవిత్రత పోతుందట. ప్రధానంగా ఇంట్లో ఆర్థికంగా తీవ్ర నష్టం వాటిల్లుతుందని చెబుతున్నారు. అలాగే రాత్రిపూట పురుషులు లేదా మహిళలు పరిమళ ద్రవ్యాలు ధరించకూడదట. ఇలాంటి పెర్ఫ్యూమ్ ధరించడం వల్ల ఇంట్లో నెగిటివిటీ పెరుగుతుందట. అది దుష్ట శక్తులు ఒకరి మనస్సుపై మరింత ఆధిపత్యం చెలాయిస్తుందట. కాబట్టి దీన్ని చేయవద్దని పండితులు సూచిస్తున్నారు.

అప్పు చేయకూడదు డబ్బు అవసరం అనేది ప్రతి ఒక్కరికీ ఎప్పుడూ ఉండేదే. కానీ మీరు డబ్బు తీసుకోవాలనుకుంటే, రాత్రిపూట చేయకండి. అదేవిధంగా రాత్రిపూట ఎవరికీ అప్పు ఇవ్వవద్దు. ఇలా చేస్తే మీ ఇంట్లో ఉండే లక్ష్మీదేవి ఇల్లు వదిలి వెళ్లిపోతుందట. ఎంతో ఎమర్జెన్సీ అయితే తప్పితే రాత్రిపూట డబ్బు అప్పుగా ఇవ్వకూడదని అప్పుగా తీసుకోకూడదని చెబుతున్నారు. తులసి ఆకులను సూర్యాస్తమయం తర్వాత అసలు తెంపకూడదట. అలా తెంపితే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురై ఇంట్లో దారిద్ర్యం వస్తుందని,అలాగే ఇంట్లో సంతోషం, శాంతి తగ్గిపోయి ఇంట్లో సమస్యలు పెరుగుతాయని చెబుతున్నారు. రాత్రి పడుకునే ముందు వంటగదిలో ఆహార పాత్రలను ఖాళీగా ఉంచవద్దు. అలా ఖాళీ పాత్రలను ఉంచడం అశుభం. ఇలా ఉంచితే అన్నపూరాణి, లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతారట. ఫలితంగా ఇంట్లో ఆహార కొరత ఏర్పడుతుందని, డబ్బు సమస్యలు పెరుగుతాయని చెబుతున్నారు. అదేవిధంగా రాత్రిపూట జుట్టు విప్పి పడుకోవడం మంచిది కాదట.

Exit mobile version