Maha Kumbh Padayatra : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్ రాజ్‌లో జరుగుతున్న మహాకుంభ మేళాకు వస్తున్న భక్తుల్లో కొందరు చాలా స్పెషల్. ఈ జాబితాలోకి వస్తారు నేపాల్‌కు చెందిన 58 ఏళ్ల రూపేన్ దాస్, పతీ రాణి దంపతులు. రూపేన్ దాస్ రివర్స్‌లో నడుస్తూ నేపాల్ నుంచి ప్రయాగ్‌రాజ్‌కు వస్తున్నాడు. అతడి భార్య తలపై లగేజీ ఉంది. ఆమె కూడా భర్త ఎదురుగానే నడుస్తోంది.
Also Read :Rahul Gandhi: అకస్మాత్తుగా వరంగల్‌కు రాహుల్‌గాంధీ .. కారణం ఏమిటి ?
మార్గం మధ్యలో అలా..
వివరాల్లోకి వెళితే.. వీళ్లిద్దరు నేపాల్‌లోని లఖన్వర్ గ్రామస్తులు. రెండు వారాల క్రితం ఊరిలోని హనుమాన్ ఆలయంలో ప్రార్థనలు చేశారు. ఆ వెంటనే రూపేన్ దంపతులు పాదయాత్రను ప్రారంభించారు. నేపాల్ పొరుగునే ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఉంటుంది. రూపేన్, పతీరాణి దంపతులు పాదయాత్ర చేసే క్రమంలో, మార్గం మధ్యలో సనాతన ధర్మం గురించి ప్రచారం చేస్తున్నారు. ప్రజలకు దాని గురించి వివరిస్తున్నారు. ఈవిధంగా వీరు తొలుత ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌కు చేరుకున్నారు. అక్కడి నుంచి అయోధ్యకు వెళ్లి రామయ్యను దర్శించుకున్నారు. అయోధ్య నుంచి నేరుగా పాదయాత్ర(Maha Kumbh Padayatra) ద్వారా ప్రయాగ్‌రాజ్‌కు వెళ్తున్నారు. నేపాల్ నుంచి ప్రయాగ్ రాజ్‌కు దాదాపు 570 కి.మీ దూరం ఉంటుంది. ఇంతపెద్ద దూరాన్ని రూపేన్ దాస్ దంపతులు పాదయాత్రగా పూర్తి చేయాలనే లక్ష్యాన్ని పెట్టుకోవడాన్ని అందరూ ప్రశంసిస్తున్నారు.
Also Read :British PM Keir Starmer : మీడియా ముందే ఆ పని చేసిన బ్రిటన్ ప్రధాని
భిక్షాటన అస్సలు చేయరు
రూపేన్ దంపతులు పాదయాత్ర క్రమంలో భిక్షాటన అస్సలు చేయరు. మార్గం మధ్యలో ఎవరైనా బియ్యం, పప్పులు, వంట చెరుకు (కలప) ఇస్తే తీసుకుంటారు. అప్పటికే వండిన ఆహారాలను అందిస్తే తీసుకోరు. తామే స్వయంగా వంట చేసుకొని తింటారు. యూపీలోని పయాగీ పూర్‌లో కొందరు స్థానికులు ఈ దంపతులను కలిశారు. భోజన ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. అయితే అందుకు రూపేన్ నో చెప్పారు. తమకు వండిన భోజనం అవసరం లేదన్నారు. దీంతో పయాగీపూర్ వాసులు బాగా బతిమిలాడారు. దీంతో రూపేన్ దంపతులు కాస్త చెరుకు రసం తాగి, కాస్త బెల్లం తిన్నారు.