Salt: వాష్ రూమ్ లో తప్పనిసరిగా ఉప్పును ఉంచాలా.. లేకపోతే ఏం జరుగుతుందో తెలుసా?

  • Written By:
  • Publish Date - March 4, 2024 / 09:30 AM IST

మనం నిత్యం ఉపయోగివాటిలో ఉప్పు కూడా ఒకటి. ప్రతి ఒక్కరి వంట గదిలో తప్పనిసరిగా ఉప్పు ఉంటుంది. ఉప్పు లేకుండా ఎన్నో రకాల వంటలు పూర్తి కావు. ఉప్పు ప్రాధాన్యత లేదా ప్రాముఖ్యత గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆహారం రుచికరంగా ఉండాలంటే ఉప్పును ఉపయోగించడం తప్పనిసరి. ఉప్పు అనేది వంటలో లేకుంటే ఎలాంటి కూర అయినా ఆహారమైనా సరే చప్పగా మారుతుంది. ఉప్పుకు ఉన్న ప్రాధాన్యత ఒక్క ఆహారంలోనే కాదు వాస్తు పరంగా కూడా ఉప్పుకు అధిక ప్రాధాన్యత ఉందనే విషయం తెలుసుకోవాలి. వాస్తు ప్రకారం ఉప్పును ఉపయోగించడం వల్ల ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులను పారద్రోలవచ్చు. వాస్తు దోషాలను తొలగించడంలో ఉప్పు ప్రధాన పాత్ర పోషిస్తుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

అయితే భార్యాభర్తల మధ్య గొడవలు సర్వసాధారణం. చిన్న చిన్న విషయాలకే గొడవపడిపోతుంటారు. వాగ్వాదంకు దిగుతారు. కొన్ని సార్లు ఈ గొడవలు విబేధాలకు దారి తీసి కాపురంలో చిచ్చుకూడా ఏర్పడే అవకాశం ఉంది. ఈ గొడవలు మరింత ముదిరితే విడాకులకే దారి తీసే ఛాన్స్ ఉంది. ఇలాంటి గొడవలు లేకుండా సంసారం సాఫీగా సాగడంలో ఉప్పు సహాయం చేస్తుంది. గళ్ల ఉప్పును పడకగదిలో ఒక మూలకు ఉంచాలని చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీని ఈ ఉప్పు తీసుకుని బాంధవ్యాలను చక్కగా మారుస్తుంది. ఇంట్లో ఉన్న వాస్తు దోషం తొలిగిపోవాలంటే ఇంట్లోని వాష్‌రూంలో ఒక గాజు గిన్నెలో ఉప్పు ముద్ద ఉంచాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోతుంది.

వాస్తుదోషాలు సరవుతాయి. అయితే వాష్‌రూంలో ఉంచిన ఉప్పును 15 రోజుల తర్వాత మార్చుకునేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఇక ఒక వ్యక్తి సమస్యలతో కృంగిపోయి ఉన్నప్పుడు, తీవ్రంగా అలసిపోయినప్పుడు నీటిలో కొంత ఉప్పు వేసి స్నానం చేయాలి. ఇక స్నానం చేసి తుడుచుకునేప్పుడు ఉప్పు వాడితే చాలా సమస్యలు తొలగిపోతాయి. శారీరక, మానసిక, ఆర్థిక సమస్యలు తొలిగిపోవాలంటే తుడుచుకునేందుకు ఉప్పు వినియోగించాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ బయటకు వెళ్లిపోతుంది. అయితే ఈ పరిహారం గురువారం తప్ప మిగతారోజులన్నీ చేయవచ్చు.