Site icon HashtagU Telugu

‎Negative Enegry: మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోవాలంటే ఈ వస్తువులను తొలగించాల్సిందే.. అవేటంటే!

Negative Enegry

Negative Enegry

Negative Energy: మామూలుగా చాలా మంది అనేక వాస్తు విషయాలను పాటిస్తూ ఉంటారు. అలాగే ప్రతీ పనిని వాస్తు ప్రకారంగా చేస్తూ ఉంటారు. అయినా కూడా కొన్ని కొన్ని సార్లు నెగటివ్ ఎనర్జీ అనేది వెంటాడుతూ ఉంటుంది. అయితే ఇలా నెగటివ్ ఎనర్జీ తొలగిపోవాలటే కొన్ని రకాల వస్తువులను ఇంట్లో నుంచి తొలగించాలి అని చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందా.. పనికిరాని, పాడైపోయిన వస్తువులతో ఇంట్లో నెగటివ్ ఎనర్జీ పెరుగుతుందట. అలాంటి వాటిలో పాత మొబైల్ ఫోన్స్ కూడా ఒకటి.

‎వాడుతున్న ఫోన్ పాడై పోయినప్పుడు కూడా పక్కన పడేసి కొత్తది కొంటూ ఉంటారు. అయితే ఇలా వస్తవును వాడకుండా అలాగే వదిలేయడం వలన ఇంట్లో నెగటివ్ ఎనర్జీ పెరుగుతుందట. అందుకే ఇలాంటి వాటిని అమ్మేయడం కానీ, లేదా వాటి అవసరం ఉన్నవారికి ఇవ్వడం వలన ఇంట్లో ప్రతికూల శక్తులను తగ్గించినట్లు అవుతుందని చెబుతున్నారు. ‎అద్దం లక్ష్మీ స్వరూపం. కాబట్టి ఇంట్లో అద్దం పగిలి పోయి ఉండడం మంచిది కాదని చెబుతున్నారు. అలాగే పగిలి పోయిన గాజు సీసాలు, జాడీలు కూడా ఈ కోవలోకే వస్తాయట. కాబట్టి ఇంట్లో పగిలిపోయిన గాజు సీసాలు, అద్దం వంటిని ఉంచకూడదు అని చెబుతున్నారు.

‎అదేవిధంగా దేవుని మందిరంలో విరిగిపోయిన దేవుని విగ్రహాలు, పాడై పోయిన చిత్ర పటాలు ఉండకూడదట. దేవతా విగ్రహాలు లేదా చిరిగిన ఫోటోలను ఇంట్లో ఉంచడం అశుభంగా భావించాలి. మీ ఇంట్లో ఇలాంటి వస్తువులు ఉంటే వేంటనే వాటిని బయటకు పారేయడం మంచిది. కొందరు పాతబడిన, చిరిగిపోయిన వస్త్రాలను వాడకుండా అలాగే పక్కన పెట్టేసి ఉంటారు. కానీ ఇంట్లో ఇలా చిరిగిపోయిన వస్త్రాలు ఉంటే దరిద్ర దేవతకు స్వాగతం పలికినట్లే అని చెబుతున్నారు. ఒకవేళ మికు అవి అవసరం లేదు అనుకుంటే అవసరమైన వారికి ఇవ్వడం మంచిదని చెబుతున్నారు. ఇంట్లో పనిచేయని గడియారాలు, ఇతర పరికరాలను ఇంట్లో ఉంచడం అస్సలు మంచిది కాదు. ఒకవేళ మీ ఇంట్లో అలాంటి గడియారాలు ఉంటే వాటిని బాగు చేయించడం లేదా బయట పారేయడం మంచిది.

Exit mobile version