Navratri Tradition: న‌వ‌రాత్రి ఉత్స‌వాల్లో వింత ఆచారం.. పురుషులు చీర క‌ట్టాల్సిందే..!

దేశ వ్యాప్తంగా దేవి నవరాత్రి ఉత్సవాలు ఘ‌నంగా జ‌రుగుతున్నాయి. పండగ ఒకటే అయినా పాటించే పద్ధతులు, సంప్రదాయాలు ఆ ప్రాంతాల‌ను బ‌ట్టి ఉంటాయి.

  • Written By:
  • Publish Date - September 29, 2022 / 12:12 PM IST

దేశ వ్యాప్తంగా దేవి నవరాత్రి ఉత్సవాలు ఘ‌నంగా జ‌రుగుతున్నాయి. పండగ ఒకటే అయినా పాటించే పద్ధతులు, సంప్రదాయాలు ఆ ప్రాంతాల‌ను బ‌ట్టి ఉంటాయి. అయితే.. కొన్ని మనకు తెలిసినవే ఉంటాయి. మ‌రికొన్ని ఆచారాల‌ను మ‌నం అస‌లు ఊహించలేం. ఇలా కూడా చేస్తారా అనుకుంటాం. అయితే గుజ‌రాత్‌ రాష్ట్రంలో ఓ వింత ఆచారం ఉంది. న‌వ‌రాత్రి ఉత్స‌వాల‌లో భాగంగా పురుషులు కూడా డ్యాన్స్ చేస్తారు. డ్యాన్స్ చేస్తే వింత ఏముంద‌నుకుంటున్నారా.. ఆ డ్యాన్స్ కూడా పురుషులు చీర‌లు క‌ట్టుకోని వేస్తారంటా. అస‌లు పురుషులు చీర‌లు ఎందుకు క‌ట్టుకోని డ్యాన్స్ చేస్తారో తెలుసుకుందాం.!

గుజరాత్‌లో గర్భా నృత్యం ఫెమస్ అనే విషయం తెలిసిందే. అయితే.. అహ్మదాబాద్‌లోని పాతబస్తీలో పురుషులు నవరాత్రి వేడుకలు రాగానే చీరలు కట్టుకుని మరీ గర్భా డ్యాన్స్ చేస్తారు. నవరాత్రి వేడుకలలో 8వ‌ రోజున బారోట్ కమ్యూనిటీకి చెందిన పురుషులు చీరలు ధరించి గర్భా డ్యాన్స్ చేస్తారు. ఇక్కడ 200 ఏళ్లుగా ఈ ఆచారాన్ని పాటిస్తున్నారంటా.

దీనివెనుక ఒక పురాణ గాథ ఉంది. సదుబా అనే మహిళ ఒక పురుషుడి కారణంగా తన బిడ్డను కోల్పోతుంది. దాంతో ఆమె మగవాళ్లు చీరలు కట్టుకుని అమ్మవారి ముందు డ్యాన్స్ చేయాలని శాపం పెట్టింది. దాంతో అక్కడి వారు ఆమె చనిపోయాక సదుబాకు గుడి కట్టించారు. అంతేకాదు ఆ గుడికి వెళ్లే పురుషులు కచ్చితంగా చీరలు కట్టుకునే వెళ్లాలి. అలా అక్కడ పురుషులు వెళ్లి ఆమెకు ప్రార్థన చేసి.. క్షమాపణలు కోరుతుంటారు. ఈ సంప్ర‌దాయం 200 ఏళ్ల క్రితం నుంచి వ‌స్తోంద‌ని అక్క‌డి వారు న‌మ్ముతున్నారు.

అష్టమి రోజున వందలాది మంది బారోట్ కమ్యూనిటీకి చెందిన వారు సాదు మాతకు నమస్కారాలు చెల్లించడానికి సమావేశమవుతారు. అక్కడ చీరలు ధరించి గర్భా డ్యాన్స్ చేస్తారు. ఇలా ప్ర‌తి ఏడాది పురుషులు చీరలు కట్టుకుని డ్యాన్స్‌ చేయడంతో హాట్ టాపిక్‌గా మారుతోంది.