Navratri: రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా శరన్నవరాత్రుల వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఇటీవల సెప్టెంబర్ 22న నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. తొమ్మిది రోజులపాటు తొమ్మిది అలంకరణలో అమ్మవారిని ప్రత్యేకంగా పూజించనున్నారు. అయితే ప్రతీ ఏడాది అమ్మవారిని తొమ్మిది రూపాల్లో తొమ్మిది రోజులపాటు పూజిస్తారు. కానీ ఈ ఏడాది మాత్రం అమ్మవారి నవరాత్రి ఉత్సవాలను 10 రోజులపాటు జరుపుకోనున్నారు. ఇప్పటికే నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమై నేటికి 4 రోజులు అవుతోంది.
అయితే నవరాత్రి ఉత్సవాలు జరుపుకునే సమయంలో చాలామంది తెలిసి తెలియక చిన్న చిన్న పొరపాట్లు చేస్తూ ఉంటారు. వీటివల్ల ఇబ్బందులు ఎదుర్కోవడంతో పాటు కష్టాల ఊబిలో కూరుకుపోవడం ఖాయం అని చెబుతున్నారు. మరి నవరాత్రి ఉత్సవాలలో ఎలాంటి తప్పులు చేయకూడదు ఇప్పుడు మనం తెలుసుకుందాం..
నవరాత్రి సమయంలో ఎవరూ స్త్రీని అగౌరవ పరచడం, అవమానించడం లాంటివి చేయకూడదట. ఈ సమయంలో అమ్మవారు చాలా శక్తివంతంగా ఉంటారు. ఏ స్త్రీని అవమానించినా ఆమె సహించదంట.
ఎవరైనా స్త్రీని అవమానిస్తే వారిపై దుర్గా మాత ఆగ్రహానికి గురి కావడమే కాకుండా, తన ఆశీస్సులు కూడా అందనివ్వదని పండితులు చెబుతున్నారు. అలాగే నవరాత్రి ఉత్సవాల సమయంలో మద్యం, మాంసం వంటి వాడికి దూరంగా ఉండాలని చెబుతున్నారు. అలాగే నవ రాత్రుల సమయంలో మీ బట్టలు లేదా వ్యక్తిగత వస్తువులు ఇతరులకు ఇవ్వడం చేయకూడదట. ఇవి ప్రతికూల ఆచారాలకు ఉపయోగించే ప్రమాదం ఉన్నదట. అదే విధంగా నవరాత్రుల సమయంలో ఎట్టి పరిస్థితుల్లో నల్లటి వస్త్రాలు ధరిచకూడదని చెబుతున్నారు పండితులు.
Navratri: నవరాత్రుల్లో ఇలాంటి తప్పులు చేస్తున్నారా.. అయితే జాగ్రత్త.. కష్టాల ఊబిలో కూరుకుపోతారు!

Navratri