Navaratri 2023 : మీకు నచ్చిన అబ్బాయి /అమ్మాయి ని పెళ్లి చేసుకోవాలంటే..నవరాత్రి సమయంలో ఇలా చెయ్యండి

నవరాత్రి సమయంలో ప్రత్యేక పూజలు ఆచరిస్తే.. కోరుకున్న అమ్మాయి లేదా అబ్బాయితో వివాహం జరుగుతుందని జ్యోతిష్య శాస్త్రం చెపుతుంది. నవరాత్రుల్లో తృతీయ, పంచమి, సప్తమి, నవమి రోజుల్లో శివాలయానికి వెళ్లి శివపార్వతులకు నీరు, పాలు సమర్పించి పంచోపచారాలతో పూజించాలి

  • Written By:
  • Publish Date - October 12, 2023 / 02:14 PM IST

మరో మూడు రోజుల్లో నవరాత్రులు (Navaratri) మొదలుకాబోతున్నాయి. ఈ తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులు జరుగనున్నాయి. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి తొమ్మిది రోజులు దేవీనవరాత్రులు (Devi Navaratri) జరుగగా.. పదో రోజు విజయదశమి (Vijayadashami) కలసి దసరా అంటారు. దసరా పండగలో భాగంగా తొమ్మది రోజులు నృత్యాలు, పండుగకు సంబంధించిన ఇతర వేడుకలు భాగంగా జరుగుతాయి. నవరాత్రి అనే పదం శబ్దార్ధ ప్రకారంగా, సంస్కృతంలో తొమ్మిది రాత్రులు అని అర్థం, నవ అంటే తొమ్మిది, రాత్రి అంటే రాత్రులు అని అర్థం. ఈ తొమ్మిది రాత్రులు, పది రోజులలో, తొమ్మిది రూపాలలో ఉన్న శక్తి/దేవిని ఆరాధిస్తారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈ నవరాత్రలు సందర్భంగా అమ్మవారిని తొమ్మిది రోజులు తొమ్మిది అవతారాల్లో భక్తులు ఎంతో భక్తి శ్రద్దలతో పూజిస్తారు. అమ్మవారిని 9 రోజుల పాటు నియమ నిష్టలతో వివిధ రకాలుగా పూజలు చేసి ఉపవాసం చేస్తారు. ఇలా చేస్తే అమ్మవారు భక్తుల కోరికలను తీరుస్తుందని నమ్మకం. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఆర్థిక బాధలు ఉన్న, డబ్బు కొరత వంటి అన్ని సమస్యలు తొలగిపోతాయి. ఇవన్నీ ఒక విధానం అయితే.. నవరాత్రి సమయంలో ప్రత్యేక పూజలు ఆచరిస్తే.. కోరుకున్న అమ్మాయి లేదా అబ్బాయితో వివాహం జరుగుతుందని జ్యోతిష్య శాస్త్రం చెపుతుంది. నవరాత్రుల్లో తృతీయ, పంచమి, సప్తమి, నవమి రోజుల్లో శివాలయానికి (Shiva Temple) వెళ్లి శివపార్వతులకు నీరు, పాలు సమర్పించి పంచోపచారాలతో పూజించాలి. అలాగే శివపార్వతులకు కళ్యాణం జరిపించాలి. ఆ తరువాత గుడిలో కూర్చుని ఎర్ర చందనం జపమాలతో స్వామివారి మంత్రాన్ని 108 సార్లు జపించాలి. ఇలా చేస్తే కోరుకున్న అమ్మాయి / అబ్బాయి తో వివాహం జరుగుతుందని అంటున్నారు.

అలాగే వివాహ బంధంలో ఇబ్బందులు తలెత్తిన..విభేదాలు ఉన్నా నవరాత్రుల సమయంలో పూజల వల్ల భార్యభర్తల మధ్య ప్రేమ పెరుగుతుందని , విభేదాలు , గొడవలు తొలగిపోతాయని చెపుతున్నారు. అలాగే వివాహం ఆలస్యం అవుతున్న వారు కూడా నవరాత్రుల సమయంలో పూజా స్థలంలో శివ పార్వతుల చిత్ర పటాన్ని ఉంచి తరువాత పూజించి శివ మంత్రాన్ని 3,5,10 సార్లు జపించాలి. ఇలా చేస్తే వివాహంలో వచ్చే అడ్డంకులు తొలగిపోతాయి..త్వరగా పెళ్లి అవుతుందని జ్యోతిష్య శాస్త్రం చెపుతుంది.

Read Also : Kethamreddy Vinod Reddy Resign: జనసేన పార్టీకి కేతం రెడ్డి వినోద్ రెడ్డి రాజీనామా..ఎన్నికల టైంకు పవన్ ..మనోహర్ లు మాత్రమేనా..?