Site icon HashtagU Telugu

Navratri: దేవి నవరాత్రుల సమయంలో అమ్మవారిని ఎలా పూజిస్తే మంచి ప్రయోజనాలు కలుగుతాయి తెలుసా?

Navratri

Navratri

మరికొద్ధిరోజుల్లోనే దేవి నవరాత్రులు ప్రారంభం కానున్నాయి. అక్టోబర్ మూడో తారీకు గురువారం నుండి పాడ్యం నుండి 12 శనివారం విజయదశమి వరకు వరకు దేవి శరన్నవరాత్రులు జరగుతాయి. మరి ఈ నవరాత్రుల సమయంలో అమ్మ వారిని ఎలా పూజిస్తే మంచి జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఇంట్లో ఎవరైతే దంపతులు అవ్వచ్చు సింగిల్ కావచ్చు ఎవరైనా కొలవవచ్చు. అయితే 9 రోజులు అమ్మవారిని మనం ఇంట్లో కూడా అలంకరించుకోవాలా అనే సందేహం ఉంటుంది. అలాగే ఒక్కొక్క అవతారానికి ఒక్కో అష్టోత్తరం చదవాలా అనే సందేహం కూడా ఉంటుంది. లక్ష్మీ అమ్మవారి స్వరూపం లక్ష్మీ అష్టో అలా చదవడం చాలా మంచిది.

అష్టోత్తరాలు లేదా ఇంటర్నెట్ లో లేదా బయట పుస్తకాలు దొరుకుతాయి. కాబట్టి అవతారం రోజున అవతారా స్తోత్రం చదవకపోయినా ప్రతీ రోజు దుర్గా అష్టోత్తరం కూడా పారాయణం చేయవచ్చట. దుర్గా స్తోత్రం కాబట్టి అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఏ రోజు ఏ అవతారం ఆ అవతారానికి పూజించడం అనేటటువంటి చాలా విశేషం అని చెప్పాలి. ఎలాంటి సందేహం లేకుండా మీరు ఏది చేయాలనుకుంటున్నారో అది చేయవచ్చు. కానీ నిష్టగా నిబద్దతో చేయాలనీ గుర్తుంచుకోండి. మంత్రాలు చదవేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చదవాలి. కొంచెం తప్పు చదివినా వాటి ప్రభావం వేరుగా ఉంటుంది. దుర్గాసప్త సతి అక్షరదోషం లేకుండా చదవడం మంచిది. ఈ నవరాత్రులలో చండీ హోమం చేయించుకోవడం కానీ చండీ పారాయణం చేయించుకోవడం కానీ ఖచ్చితంగా ఎంతో విశేషమైన ఫలితాలు ఇస్తుంది.

గురు ఉపదేశం లేకుండా చండీ పారాయణం చేయవద్దు. ప్రతి రోజూ కుమారి పూజ లేదా సువాసినా పూజ చేయిస్తే మంచిదా దైవం మానుష్య రూపేనా నిజంగా దైవం అమ్మవారి స్వరూపం అంటే కనుక అలాగే దైవ చిన్నపిల్లలకి కానీ కూర్చోబెట్టి చక్కగా ఏ రోజు ఏ అవతారం ఆ అవతారంతో పిల్లలను అలంకరించి సులభంగా పూజించవచ్చు. కలశ స్థాపన చేయాలా అన్నది కొందరికి సందేహం ఉంటుంది చాలా మంది నవరాత్రుల్లో కలశం పెట్టుకోవడం ఆనవాయి. కలశం పెట్టుకుంటే మంచి విషయం. పెట్టుకుంటే మంచి జరగుతుంది. కలశం లేకుండా కూడా పూజ చేయించుకోవచ్చు. అమ్మవారి పూజకి వాడే పుష్పాలు అమ్మవారికి పసుపు కుంకుమ పూజ చేయడం చాలా విశేషం. అమ్మవారికి తెలుపు, ఎరుపు, పసుపు రంగు పుష్పాలంటే చాలా ఇష్టం.

ఇక అమ్మవారి పూజకి తెలుపు రంగు పుష్పాలు మల్లె, విరజాజులు మందారం, సంపెగ పువ్వుల అంటే అమ్మవారికి చాలా ఇష్టం. గులాబి పువ్వులు, తామర పువ్వులతో అమ్మవారిని పూజ చేసుకోవచ్చు. ఇంకా విశేషంగా మారేడు దలంతో కూడా పూజించుకోవచ్చు. ఇక నైవేద్యాల విషయానికి వస్తే.. పులిహోర, దద్దోజనం, చక్కర పొంగలి, పరమాన్నం, గారెలు, బూరెలు, అరిసెలు, అప్పాలు వంటివి సమర్పించవచ్చట. ఉదయం మరియు సాయంత్రం లేదా రాత్రి కూడా ఖచ్చితంగా అమ్మవారి ఆరాధన చేసుకోవచ్చు. అమ్మవారిని భక్తితో రోజూ ఒక నియమంతో పూజ చేయవచ్చు. అలాగే కుంకుమ పూజను కూడా చేసుకోవాలి. ఇది మగ ఆడవాళ్లు అమ్మవారిని కుంకుమతో ఆరాధన చేయవచ్చు.