Site icon HashtagU Telugu

Navaratri 2023 : హైదరాబాద్‌లో మొదటిసారి భారీగా శ్రీ శక్తి మహోత్సవములు.. ఘనంగా శరన్నవరాత్రులు..

Navaratri 2023 Grand Celebrations in Hyderabad as Sree Shakthi Mahothsavam

Navaratri 2023 Grand Celebrations in Hyderabad as Sree Shakthi Mahothsavam

బతుకమ్మ(Bathukamma), దసరా(Dasara) పండుగలు మొదలయ్యాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ దేవి శరన్నవరాత్రులు ఘనంగా నిర్వహిస్తున్నారు. అయితే మొదటిసారి హైదరాబాద్(Hyderabad) లో భారీగా ఓపెన్ గ్రౌండ్ లో దేవి శరన్నవరాత్రులు ఘనంగా నిర్వహిస్తున్నారు. స్వస్తశ్రీ శుభకృత్ నామ సంవత్సర ఆశ్వయుజ శుద్ధ పాఢ్యమి అనగా అక్టోబర్ 15 ఆదివారం నుండి ఆశ్వయుజ నవమి అనగా అక్టోబర్ 23 సోమవారం వరకు ప్రతి రోజు ఉదయం 8 గంటలనుండి సాయంత్రం 9-30 గంటల వరకు KPHB వద్ద గల కైతలాపుర్ గ్రౌండ్స్ లో దసరా పండుగ సందర్భంగా, ఇప్పటి వరకు జరుగనటువంటి శ్రీ శక్తి మహోత్సవాలు తొలిసారిగా హైదరాబాద్ మహా నగరంలో ఘనంగా జరుగనున్నాయి. ఈ ఉత్సవాలకు ఎలాంటి ప్రవేశ రుసుము లేకుండానే రావొచ్చని ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు.

తొమ్మిది రోజులు ప్రత్యేక హోమ కార్యక్రమాలు, సేవలు, కల్యాణాలు నిర్వహించనున్నారు. యాగ బ్రహ్మ శ్రీ శ్రీ శ్రీ హోతా సతీష్ కృష్ణ శర్మ గారి బ్రహ్మత్వంలో, జోతిష్య విద్యా విశారద శ్రీ ఆది వారాహి ఉపాశక శ్రీ శ్రీ శ్రీ లక్ష్మణ రావు గురూజీ ఆధ్వర్యంలో ప్రతీరోజు ప్రత్యేక హోమాలు జరుపబడును. శ్రీ లక్ష్మి గణపతి హోమం, రుద్ర యమలోక్త పాశుపత మహా మన్యు సూక్త పారాయణ హోమం, దశమహావిద్య హోమం,ఆదిత్యాది నవగ్రహ ఆరాధనా హోమం, చండీ హోమం, శ్రీ ఉచ్చిష్ట మహాగణపతి హోమం, శ్రీ సూక్త హోమం, సరస్వతి హోమాలతో పాటు సామూహిక అక్షరాభ్యాసాలు, నవదుర్గ పల్లకీ సేవలు, శ్రీ చక్రనవావరణ అర్చన, సహస్రనామార్చనలు, కుంకుమార్చనలు, శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణమహోత్సవం, కామ్యవృషోగజనమ్ (గో కళ్యాణం) మొదలైన కార్యక్రమాలు నిర్వహించబడును.

అలాగే ప్రతీ రోజు బతుకమ్మ ఉయ్యాల పాటలతో గౌరీ దేవి పూజలు, ఉన్నత ప్రమాణాలు కలిగిన సంగీతంతో దాండియా, మన తెలుగు సాంస్కృతిక సంప్రదాయాలతో పాటు, కేరళ, కర్ణాటక, మహా రాష్ట్ర, బెంగాలీ, వంటి భిన్న సంసృతి కలిగిన సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడును. ఈ సాంస్కృతిక కార్యక్రమాలలో సినీ, టివి రంగానికి చెందిన పలువురు నటీనటులు, సినీ ప్రముఖులు కూడా పాల్గొనబోతున్నారు. ఈ కార్యక్రమాలన్నీ ప్రముఖ సినీ ఈవెంట్ ఆర్గనైజర్ శ్రేయాస్ మీడియా భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తుంది.

ప్రత్యేక పూజలలో, హోమం లో పాల్గొనదలచినవారు, అక్కడ స్టాల్ల్స్ ఏర్పాటుకు మరియు మిగతా వివరాలకు 8466012345 నంబర్ ని సంప్రదించగలరు. అలాగే వాట్సాప్ నంబర్ 9666026666 కు సంప్రదించగలరు. మరిన్ని వివరాలకు www.srishakthimahotsavam.com సైట్ లో చూడొచ్చు.

Also Read : Bathukamma 2023 : బతుకమ్మ పండుగను ఎలా జరుపుకుంటారు.. ఏ రోజు ఏం నైవేద్యం పెడతారు?