హిందువులు ఎక్కువగా కొలిచే దేవుళ్ళలో లక్ష్మీనరసింహస్వామి కూడా ఒకరు. ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్క పేరుతో ఒక అవతారంలో దర్శనమిస్తూ ఉంటారు లక్ష్మీనరసింహస్వామి. విష్ణువు అవతారాల్లో ఉగ్రరూపం నరసింహస్వామి అన్న విషయం తెలిసిందే. సగం నరుడు సగం సింహం కలిపిన తరం దాల్చిన రోజుని నరసింహ స్వామి జన్మ దినోత్సవంగా జరుపుకుంటూ ఉంటారు. ప్రతి సంవత్సరం ఈ పండుగను చాలా ఘనంగా జరుపుకుంటూ ఉంటారు. అంతేకాకుండా చెడుపై మంచి విజయానికి ప్రతీక. ఈ రోజున నరసింహుడు తన భక్తుడు ప్రహ్లాదుడిని రక్షించడానికి హిరణ్యకశిపు అనే రాక్షసుడిని చంపాడు.
ఈ రోజున భక్తులు ఉపవాసం ఉండి పూజలు చేయడం ప్రత్యేక నియమాలను పాటించడం ద్వారా నరసింహ స్వామి ఆశీర్వాదం పొందుతారట. నరసింహ జయంతి రోజున కొన్ని ప్రత్యేక నియమాలను పాటించడం అవసరం. ఈ నియమాలను ఉల్లంఘిస్తే నరసింహ స్వామి కోపంగా ఉంటాడని అటువంటి వారు జీవితంలో అనేక ఇబ్బందులను ఎదుర్కొంటారట. వైశాఖ మాసంలోని శుక్ల పక్ష చతుర్దశి తిధి మే 10న సాయంత్రం 5:29 గంటలకు ప్రారంభమవుతుందట. అదే సమయంలో ఈ తిది మే 11న రాత్రి 9:19 గంటలకు ముగుస్తుందట. కాబట్టి ఈ సంవత్సరం నరసింహ జయంతి మే 11న జరుపుకుంటారు. నరసింహ జయంతి రోజున పూర్తిగా సాత్విక ఆహారం తినాలట.
మాంసం, మద్యం, వెల్లుల్లి, ఉల్లిపాయలు వంటి తామసిక పదార్థాలను తినకుండా ఉండాలట ఈ రోజు దేవునికి అంకితం చేయబడింది. అలాగే మానసిక శారీరక స్వచ్ఛతను కాపాడుకోవడం చాలా అవసరం. ఈ రోజున ఎవరినీ, ముఖ్యంగా వృద్ధులను లేదా బలహీనులను అవమానించకూడదట. నరసింహ స్వామీ సకల జీవుల్లోనూ ఉన్నాడు. ఎవరినైనా అగౌరవపరిస్తే, అతనికి కోపం కలుగుతుందని చెబుతున్నారు. నరసింహ జయంతి నాడు నలుపు లేదా నీలం రంగు దుస్తులు ధరించకూడదట. ఈ రోజున పసుపు, ఎరుపు లేదా కుంకుమ రంగు దుస్తులు ధరించడం శుభప్రదంగా భావిస్తారు. ఈ రంగు సానుకూల శక్తి , శుభాన్ని సూచిస్తుందట. ఈ రోజున బ్రహ్మచర్యాన్ని పాటించడం ముఖ్యం అని భావిస్తారట. కనుక నరసింహ జయంతి రోజున శారీరక సంబంధాలకు దూరంగా ఉండాలని చెబుతున్నారు.