Naraka Chaturdashi: హిందువులు జరుపుకునే అతి ముఖ్యమైన పండుగలలో దీపావళి పండుగ కూడా ఒకటి. దీపావళి పండుగ అంటే వెలుగుల పండుగ. అంటే దీపం అనే కాంతి వెలుగులో మనిషి అజ్ఞానం నుంచి జ్ఞానం వైపు సాగాలని సూచించే పండగ. ఇది చెడుపై మంచి విజయాన్ని సూచిస్తుంది. ఈరోజున హిందువులు ఇంటిని చక్కగా దీపాలతో అలంకరించడంతో పాటు, లక్ష్మీదేవి విఘ్నేశ్వరుడిని పూజిస్తూ ఉంటారు. చిన్న పెద్దా అని తేడా లేకుండా ప్రతీ ఒక్కరు టపాసులు పేలుస్తూ ఉంటారు.
ఇకపోతే దీపావళికి ముందు రోజు జరుపుకునే చోటి దీపావళిని నరక చతుర్దశి అని పిలుస్తారు. హిందూమతంలో దీనికి ప్రత్యేక ప్రాముఖ్యత కూడా ఉంది. ఈ రోజున యమ ధర్మ రాజును పూజిస్తారు. యమ ధర్మ రాజును పూజించడం వల్ల అందం, దీర్ఘాయువు లభిస్తుందని నమ్మకం. కాగా నరక చతుర్దశి ఆశ్వయుజ మాసం కృష్ణ పక్ష చతుర్దశి నాడు వస్తుంది. ఈ సంవత్సరం చతుర్దశి తేదీ అక్టోబర్ 19న మధ్యాహ్నం 1:51 గంటలకు ప్రారంభమై అక్టోబర్ 20న మధ్యాహ్నం 3:44 గంటలకు ముగుస్తుంది. అందువల్ల ఈ సంవత్సరం అక్టోబర్ 19న ఆదివారం రోజున చోటి దీపావళిని అంటే నరక చతుర్ధశిని జరుపుకుంటారు.
దీపావళిని అక్టోబర్ 20న సోమవారం 2025న జరుపుకుంటారు. చోటి దీపావళి నాడు పూజకు శుభ సమయం ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది. అక్టోబర్ 19న శుభ సమయం రాత్రి 11:41 నుంచి ఉదయం 12:31 వరకు ఉంది. నరక చతుర్దశి కూడా దీపావళి పండగలో ఒక ముఖ్యమైన భాగం. ఈ రోజున కొన్ని నియమాలను నటించాలని చెబుతున్నారు. ప్రధాన ద్వారం వద్ద నువ్వుల నూనెతో నిండిన పెద్ద ఏకముఖి దీపాన్ని వెలిగించాలట. అలాగే తినే ఆహారంలో ఉల్లిపాయ, వెల్లుల్లిని నివారించాలట. మీ ఇంటి వద్దకు వచ్చిన పేదవారిని ఖాళీ చేతులతో పంపించకూడదట. అలా చేయడం వల్ల జీవితంలో సానుకూల మార్పులు వస్తాయని చెబుతున్నారు.
Naraka Chaturdashi: ఈ ఏడాది నరక చతుర్దశి ఎప్పుడు? అక్టోబర్ 19నా లేక 20నా.. ఈరోజు పాటించాల్సిన నియమాలు ఇవే!

Naraka Chaturdashi