Site icon HashtagU Telugu

Nandivardhana Plant: మీ ఇంట్లో కూడా ఈ చెట్టు ఉందా.. అయితే ఈ విషయం తప్పకుండా తెలుసుకోవాల్సిందే?

Mixcollage 13 Feb 2024 01 56 Pm 1780

Mixcollage 13 Feb 2024 01 56 Pm 1780

మామూలుగా చాలామంది ఇంట్లో ఎన్నో రకాల మొక్కలను పెంచుకుంటూ ఉంటారు. అటువంటి వాటిలో నందివర్ధనం మొక్క కూడా ఒకటి. ఈ మొక్కని గరుడవర్ధనం అని కూడా పిలుస్తూ ఉంటారు. చాలామంది ఈ మొక్కలను ఇంట్లో పెంచుకుంటారు కానీ వాటి వల్ల కలిగే లాభాల గురించి మంచి మంచి ఫలితాల గురించి అసలు తెలియదు. ఒకవేళ మీరు కూడా మీ ఇంట్లో నందివర్ధనం మొక్కను పెంచుకుంటుంటే వెంటనే ఈ విషయం తెలుసుకోవాల్సిందే. ప్రకృతిలో ఉన్న మొక్కలు మనకు అనేక ఔషధాలను ఇస్తాయి. అనేక రకాల ఔషధ గుణాలను కలిగి ఉన్న ఈ మొక్కలు వ్యాధుల నుండి మనల్ని కాపాడతాయి.

కలుపు మొక్కలు అందం కోసం పెంచుకునే మొక్కలను కూడా ఆయుర్వేద ఔషధాలు తయారీలో ఉపయోగిస్తూ ఉంటారు. అలాంటి ఔషధ గుణాలు ఉన్న మొక్కలలో మనం ప్రతి ఇంటి ముందు పెంచుకునే ఈ నందివర్దన చెట్టు కూడా ఒకటి. ఈ పువ్వులను దేవుని పూజకు ఉపయోగించడమే కాకుండా దీంట్లో ఉండే ఔషధ గుణాలు ఎన్నో వ్యాదులకు కూడా సహాయపడతాయి. ఈ నందివర్ధనం వేర్లు చేదుగా ఉంటాయి. దీని వేర్లను నమలటం వల్ల పంటి నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది. నందివర్ధనం పువ్వుల రసం కంటి చూపు చర్మవ్యాధులకు మంచి ఔషధం నొప్పి తీవ్రమైన విరేచనాల కారణంగా కడుపునొప్పికి నందివర్ధనం పువ్వులను ఉపయోగిస్తారు.

చికిత్సలో కూడా ఉపయోగిస్తారు. రక్తపోటును నియంత్రించడానికి నందు వర్ధనం చెట్టు ఆకు కషాయం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎరుపు గుజ్జు బట్టలకు రంగు వేయటానికి ఉపయోగిస్తారు. ఎక్కువగా పెరిగే మొక్క ఈ చెట్టు పువ్వులు, ఆకులు రసం, వేర్లు అన్ని ఔషధ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇంతకీ విశిష్టత కలిగిన ఈ చెట్టు కనుక మీ ఇంట్లో లేకపోతే కచ్చితంగా పెంచుకోండి. ఈ నందివర్ధనం పూలతో ఆశ్రీమహాలక్ష్మి దేవిని ప్రతి శుక్రవారం రోజు మీరు ఆరాధించినట్లయితే కనక అష్టైశ్వర్యాలు మీకు కలుగుతాయి. ఆ శ్రీ మహాలక్ష్మి దేవి కటాక్షం మీకు శుద్ధిస్తుంది. అష్టైశ్వర్యాలు కలుగుతాయి. అలాగే ఆర్థికపరమైన సమస్యలు కూడా దూరం అవుతాయట.