ఈ సంవత్సరం నాగులపంచమి ఆగస్టు 2 మంగళవారం నాడు వస్తుంది. శ్రావణమాసంలో శుక్లపంచమిరోజున నాగుపంచమి జరుపుకుంటారు. ఈ రోజున నాగదేవతను పూజించి..పాములకు పాలు పోస్తుంటారు. అంతేకాదు ఈ రోజు శివుడికి రుద్రాభిషేకం చేస్తారు. ఈ పర్వదినాన నాగదేవతను పూజిస్తే జీవితంలోని అన్ని కష్టాలు తొలగిపోతాయని భక్తులు నమ్ముతుంటారు. అలాంటి నాగుపంచమి రోజు ఏ పనులు చేయాలి ఎలాంటి పనులు చేయకూడదో తెలుసుకుందాం.
ఈ పనులు చేయండి…
నాగులపంచమి రోజున ఉపవాసం ఉండి..నాగదేవతను పూజించాలి. ఇలా చేస్తే మీరు పాముకాటు నుంచి రక్షింబడతారు. నాగదేవతను ఆరాధించేటప్పుడు పాలు, స్వీట్లు పువ్వులు సమర్పించాలి. పూజ చేసేటప్పుడు నాగపంచమి మంత్రాన్ని తప్పనిసరిగా పఠించాలి. మీ జాతకంలో రాహు కేతువులు ఉంటే…ఈ రోజున నాగదేవతను పూజించాలి. ఇలా చేస్తే మీ జాతకంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి. శివలింగంపై ఇత్తడిచెంబుతో పాలు పోయాలి. అదే విధంగా రాగిపాత్రతో నీటినిపోయాలి. ఇలా చేస్తే శివుడి ఆశీస్సులు మీకు లభిస్తాయి.
ఈ పనులు అసలు చేయకండి…
నాగుల పంచమి రోజున చెట్లను నరకడం, వ్యవసాయం చేయకూడదు. ఎందుకంటే అలా చేస్తే అక్కడ నివసించే పాములకు హాని కలుగుతుంది. నాగుల పంచమి రోజున పొరపాటున కూడా సూది, దారం ఉపయోగించవద్దు. ఇలా చేస్తే అశుభంగా భావిస్తారు. ఈ రోజు వివాదాలకు దూరంగా ఉండాలి. ఎవరితోనూ దూషించే మాటలు మాట్లాడవద్దు. ఇనుపపాత్రల్లో వంట చేయకూడదు. అలా చేస్తే నాగదేవతకి ఇబ్బంది కలుగుతుంది. నాగులపంచమి రోజున మాంసాహారం లేదా మద్యానికి దూరంగా ఉండాలి.