Nagula Chavithi : ఇవాళ నాగుల చవితి.. వర్జ్యం, దుర్ముహూర్తం ఇదీ..

Nagula Chavithi : ఇవాళ నాగులచవితి. చవితి ఘడియల తిథి వాస్తవానికి నవంబరు 16న గురువారం మధ్యాహ్నం 12.54 గంటలకే మొదలైంది.

  • Written By:
  • Updated On - November 17, 2023 / 08:31 AM IST

Nagula Chavithi : ఇవాళ నాగులచవితి. వాస్తవానికి నాగుల చవితి తిథి నవంబరు 16న గురువారం మధ్యాహ్నం 12.54 గంటలకే మొదలైంది. నాగులచవితి తిథి ఈరోజు(శుక్రవారం) ఉదయం 11.32 వరకు ఉంటుంది. ఈరోజు భూమిని దున్నకూడదు. కూరగాయలు కట్ చేసి తినకూడదు. ఉపవాసం ఉన్నవారు సాయంత్రం పండ్లు, పాలు తీసుకోవాలి. కట్ చేసి ఆహారాన్ని తీసుకోకూడదు. ఇవాళ ఉదయం 11:32 లోపు నాగేంద్రుడిని, శివుడిని పూజ చేసుకోవాలి. వర్జ్యం, దుర్ముహూర్తాలు లేని సమయం చూసి ఇంట్లో పూజ పూర్తిచేసి, పుట్టలో పాలు పోయాలి. ఇవాళ దుర్ముహూర్తం  ఉదయం 8.23 నుంచి 9.08 వరకు, మధ్యాహ్నం 12.08 నుంచి 12.54 వరకు ఉంది.  ఈరోజు వర్జ్యం  మధ్యాహ్నం 12.46 నుంచి 2.18 వరకు ఉంది.

We’re now on WhatsApp. Click to Join.

నాగుల చవితి పరమార్ధం 

పండితుల కథనం ప్రకారం.. మానవ శరీరమనే పుట్టకు నవరంధ్రాలు ఉంటాయి. శరీరంలో నాడులతో నిండి ఉన్న వెన్నెముకను ‘వెన్నుపాము’ అని కూడా పిలుస్తారు. కుండలినీ శక్తి అనేది మూలాధార చక్రంలో “పాము” ఆకారంలా ఉంటుందని యోగశాస్త్రం చెబుతోంది. ఇది మానవ శరీరంలో నిద్రిస్తున్నట్టు నటిస్తూ.. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు అనే విషాల్ని కక్కతూ.. మనిషిలో ఉన్న సత్వగుణాన్ని హరిస్తుంది. అందుకోసమే నాగుల చవితిరోజున పాము పుట్టలను ఆరాధించి పాలుపోస్తే మనిషిలో ఉన్న విషసర్పం శ్వేతత్వం పొందుతుందని చెబుతారు.

పాములు పాలు తాగవు.. కానీ.. 

పాములు పాలు తాగవన్నది నిజమే. అవి సరిసృపాలు కాబట్టి వాటికి జీర్ణవ్యవస్థ ఉండదు. కానీ నాగులు, దేవతాసర్పాలు అందుకు భిన్నంగా ఉంటాయి. భక్తికి మెచ్చిన నాగదేవతలు అనేకరూపాల్లో దర్శనమిచ్చి పూజలు అందుకుంటాయి. ఆరోగ్యాన్ని, సంతానాన్ని అనుగ్రహిస్తాయి. దేవతాసర్పాలకు కూడా శక్తులు ఉంటాయి. అవి కొన్ని ప్రత్యేకమైన క్షేత్రాల్లో ఇప్పటికీ ఉన్నాయని హిందువుల విశ్వాసం. కొన్ని ఆలయాల్లో పాములకు పూజలు చేయడం, పాములు అప్పుడప్పుడు కనిపించి మాయమవడమే ఇందుకు ఉదాహరణ అని పండితులు(Nagula Chavithi) చెబుతుంటారు.

Also Read: Allu Arjun Remuneration : ఒక్క యాడ్ కు రూ.8 కోట్లు డిమాండ్ చేస్తున్న పుష్పరాజ్…తగ్గేదేలే

గమనిక: ఈ సమాచారం వివిధ మాధ్యమాలు/జ్యోతిష్యులు/పంచాంగాలు/ఉపన్యాసాలు/నమ్మకాలు/గ్రంధాల నుండి సేకరించిన తర్వాత మీ ముందుకు తీసుకురాబడింది. మా లక్ష్యం సమాచారాన్ని అందించడం మాత్రమే, దాన్ని వినియోగదారులు కేవలం సమాచారంగా తీసుకోవాలి. అదనంగా, దాని యొక్క ఏదైనా ఉపయోగం వినియోగదారు యొక్క పూర్తి బాధ్యత.