నాగుల చవితి (Nagula Chavithi) హిందూ సంప్రదాయంలో ప్రధాన పండుగలలో ఒకటి. ఇది ప్రత్యేకంగా నాగ దేవతల పూజకు అంకితం చేయబడింది. కార్తీక మాసంలో, చతుర్థి తిథి నాడు ఈ పండుగను జరుపుకుంటారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో ఈ పండుగకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది.
(Nagula Chavithi) పండుగ నేపథ్యం :
నాగుల చవితి రోజు ప్రజలు నాగ దేవతలైన నాగుల ప్రతిమలను పూజిస్తారు. నాగాలను పూజించడం ద్వారా తమకు, తమ కుటుంబ సభ్యులకు మరియు పొలాలకు రక్షణ కలుగుతుందని విశ్వసిస్తారు. నాగులు భూలోకంలో మరియు పాతాళంలో స్థిరపడిన శక్తులుగా భావించబడటంతో, నాగుల చవితి రోజున సర్పదేవతలకు పాలాభిషేకం చేస్తారు. ఈ పూజ భూస్థాపన, వర్షాలు, మరియు శక్తి దాయకంగా ఉంటుంది.
పూజా (Nagula Chavithi Pooja) విధానం :
నాగ దేవతల పూజ: నాగుల చవితి రోజున నాగ దేవతల విగ్రహాలు లేదా ప్రతిమలు ఏర్పాటు చేసి పాలు, క్షీరద్రవ్యాలతో అభిషేకం చేస్తారు.
పూజా సామగ్రి: పాలు, పసుపు, కుంకుమ, చింతపండు, వాము, బెల్లం వంటి పదార్థాలు పూజలో ఉపయోగిస్తారు.
వ్రతం: కొంతమంది మహిళలు ఉపవాసం ఉండి నాగుల చవితి పూజ చేస్తారు. ఈ రోజు సర్పాలనుండి రక్షణ కలగాలని కోరుకుంటూ భక్తిగా ప్రార్థనలు చేస్తారు.
ప్రాముఖ్యత :
నాగుల చవితి పండుగ అనేది ప్రకృతితో మనకున్న సంబంధాన్ని గుర్తు చేస్తూ, పంటల సంరక్షణ కోసం సర్ప దేవతల ఆశీస్సులు పొందడంలో అర్థం ఉంది. పంటలకు హాని కలిగించే పురుగులను నివారించడంలో, సర్పాల పాత్ర ఉందని పురాణాలు చెబుతున్నాయి.
ఏడాది నాగుల చవితి ఎప్పుడు అంటే..
తెలుగు పంచాంగం ప్రకారం కార్తీక శుద్ధ చవితి నవంబర్ 5వ తేదీ మంగళవారం వచ్చింది కాబట్టి ఆ రోజునే నాగుల చవితి పండుగ జరుపుకోవాలని పంచాంగ కర్తలు సూచిస్తున్నారు. మంగళవారం ఉదయం 5 గంటల నుంచి 9 గంటల వరకు పూజకు శుభసమయం. ఈసారి నాగుల చవితి మంగళవారం రావడం మరింత విశేషమైనది పండితులు చెబుతున్నారు. ఏ మాత్రం వీలు ఉన్నా నాగుల చవితి రోజు దేవాలయాలలో వెలసిన సుబ్రహ్మణ్య స్వరూపమైన నాగ ప్రతిష్టకు క్షీరాభిషేకం చేయడం ఉత్తమం.
నాగుల చవితి రోజు చేయకూడని పని :
సనాతన సంప్రదాయాలు పాటించే వారు నాగుల చవితి రోజు కూరగాయలు గాని పండ్లు గాని తరగ రాదు అని అంటారు.
Read Also : Raghunandan Rao : మాజీ సర్పంచుల పెండింగ్ బిల్లులపై సీఎం స్పందించాలి: రఘునందన్