Site icon HashtagU Telugu

Nagula Chavithi: నాగుల చవితి రోజు పుట్ట వద్ద ఏం చేయాలి? ఏం చేయకూడదో మీకు తెలుసా?

Nagula Chavithi

Nagula Chavithi

హిందువులు జరుపుకునే పండుగలో నాగుల చవితి కూడా ఒకటి. ఈ పండుగ రోజున ఊరిలో ఉన్న గుళ్ళలో ఉన్న పుట్టలలో కానీ లేదా ఊరి బయట ఉన్న పాము పుట్టలో పాలు పోస్తారు. పుట్టలో పాలు పోయటమనేది భారతదేశంలో అనాదిగా వస్తున్న ఆచారం. ఈ పండగకు పిల్లలతో కుటుంబ సభ్యలతో కలిసి పుట్టలో పాలు పోస్తుంటారు. దేవాలయాల్లో రాతి విగ్రహా జంట పాముల ప్రతిమలు, రెండు పాములు మెలికలు వేసుకొని రావి, వేప చెట్ల కింద దర్శనం ఇవ్వటం మనము ఎక్కువ గమనిస్తుంటాము. చవితి నాడు సర్పాలను పూజిస్తే సర్వరోగాలు, వైవాహిక దాంపత్య దోషాలు, గర్భదోషాలు పోయి ఆరోగ్యవంతులు అవుతారని భక్తులు విశ్వాసం.

ఇకపోతే నాగుల చవితి రోజు పొరపాటున కూడా పుట్ట దగ్గర కొన్ని రకాల పనులు అస్సలు చేయకూడదు. కొన్ని రకాల పనులు చేయవచ్చు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. పాలు పుట్టలో పాలు పోయకూడదు. ముఖ్యంగా గమనించ వలసిన విషయం పుట్టలో వాస్తవానికి పాలు పోయకూడదు. పాముకు పాలు అరగవు. పుట్టకు పాలుపోయలనుకునే వారు పుట్ట దగ్గర ఒక మట్టి కంచుడు లేదా దొప్పను పెట్టి అందులో పాలు పోయాలి. అనవసరంగా పుట్టను తడిపి పాముకు కీడు చేసిన వారం కాకూడదు. పాము విగ్రహాలను మాత్రం పాలతో అభిషేకం చేయవచ్చును. మన ఇల్లు తడిగా ఉంటే మనం ఎలా ఫీల్ అవుతామో అదేవిధంగా పొడిగా ఉంటే ఎలాంటి అనుభూతి కలుగుతుందో ఉహించుకుని మన చర్య వలన ఏ ప్రాణి ఇబ్బంది కలగనప్పుడే మనకు పుణ్యఫలం దక్కుతుంది..

అలాగే ఎవరైనా పుట్టకు కోడి గుడ్డు సమర్పించాలనుకునే వారు పుట్టపై పెట్టాలి తప్ప పుట్ట రంద్రాలలో వేయకూడదు. పాము పుట్టలోకి వెళ్ళె మార్గానికి అంతరాయం కలిగించకూడదు. పుట్టపై బియ్యం పిండిలో చక్కర కలిపి పుట్టపై చల్లాలి. దీని వలన పుట్టను అభివృద్ధి చేసే చీమలకు ఆహారం సమృద్ధిగా లభించడం వలన పుట్ట పెరుగుతుంది ఆ పుణ్య ఫలంతో సంసారం అభివృద్ధి చెందుతుంది. ఇక పూజకోరకు తీసుకువెళ్ళిన పసుపు, కుంకుమ పూలతో అలంకరణ చేసుకుని బెల్లంతో వండిన పరమాన్నం నైవేద్యంగా పెట్టాలి. మీ కోరికలు తీరడానికి బంగరం, వెండితో చేసిన ఐదు నాగపడిగేలను పుట్టలో వేసి దూప, దీప, నైవెద్యాలు సమర్పరించిన తర్వత కొబ్బరికాయ కొట్టి ఆ నీళ్ళను పుట్టపై చల్లాలి. పుట్టచుట్టూ ప్రదక్షిణలు మనసులో కోరికలు నాగదేవతకు విన్నవించాలి చివరగా అక్షితలు చేతిలోపట్టుకుని మనస్సులో ఉన్న కోరికలను నాగ దేవతకు విన్నవించుకుంటూ పుట్టచుట్టూ మూడు ప్రదక్షిణలు భక్తి శ్రద్ధలతో చేయాలి. హారతి ఇచ్చి నమస్కారం చేసుకోవాలి. ఇక్కడ మగవారు సాష్టాంగ ,ఆడవారు మోకాలి పై వంగి , గర్భిని స్థ్రీలు నిలబడి నమస్కారం చేసుకోవాలి. సంతాన సమస్యలు ఉన్న స్త్రీలు పుట్టపై ఉన్న తడి మట్టిని కొంత తన చేతితో తీసుకుని పొట్ట భాగంలో రాసుకోవాలి. ఇలా చేస్తే పిల్లలు కాని వారికి గర్భ సంబంధమైన దోషాలకు చక్కటి తరునోపాయం. భక్తితో ఈ నాగదేవత పూజ చేస్తే సమస్త దోషాలకు చక్కటి నివారణ మార్గం.