Site icon HashtagU Telugu

Double Whorl: రెండు సుడులు ఉంటే నిజంగానే రెండు పెళ్లిళ్లు అవుతాయా?

Double Whorl (2)

Double Whorl (2)

మామూలుగా ప్రతి ఒక్కరికి తలపై రెండు సుడులు ఉండడం అన్నది కామన్. పుట్టుకతోనే తలపై ఈ సుడులు వస్తూ ఉంటాయి. కొందరికి ఒక్క సుడి మాత్రమే ఉంటే మరికొందరికి రెండు సుడులు ఉంటాయి. అయితే ఇలా రెండు సుడులు ఉన్నప్పుడు రెండు పెళ్లిళ్లు అవుతాయని చాలామంది ఆటపట్టిస్తూ ఉంటారు. కొంతమంది దానిని నిజమని నమ్ముతూ ఉంటారు. మరి నిజంగానే రెండు సుడులు రెండు పెళ్లిళ్లు జరుగుతాయా, ఈ విషయం గురించి నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. సాధారణంగా రెండు సుడులు ఒక్క మగవారికే కాదు ఆడవారికి కూడా ఉంటాయి.

కానీ రెండు పెళ్లిళ్లు అని ఎక్కువగా మగవారినే ఆటపట్టిస్తుంటారు. ఎందుకంటే అమ్మాయిలకు జుట్టు పెద్దగా ఉండటం వల్ల ఆ సుడులు కనిపించవు. ఈ సంగతి పక్కన పెడితే అసలు రెండు సాధారణంగా తలలో రెండు సుడులు చాలా తక్కువ మందికే ఉంటాయి. ఒక అధ్యయనం ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా కేవలం 5 శాతం మందికి మాత్రమే ఇలా రెండు సుడులు ఉంటాయి. నిజానికి రెండు సుడులు ఏర్పడటానికి జెనెటిక్స్ కూడా ఒక కారణమేనని సైన్స్ చెబుతోంది. అంటే వాళ్ల తాతలు, ముత్తాలు అంటూ కుటుంబంలో ఎవరికైనా ఉంటే ఇది ముందు తరాల వారికి కూడా వచ్చే అవకాశం ఉందని సైన్స్ చెబుతోంది.

అయితే పళ్లేటూర్లలో రెండు సుడులు ఉన్నవారు రెండు పెళ్లిళ్లు చేసుకుంటారు అనే విషయాన్ని నమ్మడానికి కూడా ఒక కారణం ఉంది. ఊర్లలో కొన్ని పెళ్లిళ్లు ఎంగేజ్మెంట్ దాకా వెళ్లి ఆగిపోతుంటాయి. ఆ తర్వాత మళ్లీ పెళ్లి కుదుర్చుకుని పెళ్లిపీఠలు ఎక్కుతాయి. దీన్నే రెండు పెళ్లిళ్లుగా భావిస్తారు. ఏదేమైనా ఈ రెండు సుడులు, రెండు పెళ్లిళ్లకు అస్సలు సంబంధమే లేదట. రెండు సుడులు ఉన్నంత మాత్రానా రెండు పెళ్లిళ్లు జరుగుతాయనుకోవడం ఒట్టి అపోహే మాత్రమే అని చెబుతున్నారు. అలాగే దీనికి సైంటిఫిక్ గా ఎలాంటి ఆధారం లేదని నిపుణులు చెబుతున్నారు. రెండు సుడులు ఉన్నవారు మంచి లక్షణాలను కలిగి ఉంటారట. అంటే వీరికి సహనం ఎక్కువగా ఉంటుంది. అందరికీ చేతనైనా సాయం చేస్తారు. వీరిది ప్రేమ గుణం. అలాగే వీరు దయగలవారని నిధులు చెబుతున్నారు.