Site icon HashtagU Telugu

Mystery Temple: ఇది తెలుసా.. ఈ ఆలయంలో అమ్మవారికి ఏసీ లేకుంటే చెమటలు పడతాయట.. ఎక్కడో తెలుసా?

Mystery Temple

Mystery Temple

భారతదేశంలో ఎన్నో రకాల పురాతన దేవాలయాలు ఉన్నాయి. అందులో ఒక్కొక్క దేవాలయం ఒక ప్రత్యేకత విశిష్టతను కలిగి ఉంది. వాటిలో ఎన్నో రకాల రహస్యాలు దాగి ఉన్నాయి. వీటిని సందర్శించేందుకు దేశవ్యాప్తంగా అని కాకుండా ఇతర దేశాల పర్యటకులు కూడా వస్తూ ఉంటారు. అలాగే కొన్ని ఆలయాల్లో అనేక మిస్టరీలు కూడా ఉన్నాయి. అందులో మధ్య ప్రదేశ్ ప్రాంతం లోని జబల్‌పూర్‌ లో ఉన్న ఆలయం కూడా ఒకటి. ఈ ఆలయంలో కాలిక అమ్మవారు కొలువై ఉన్నారు. ఈ ఆలయం దసరా నవరాత్రుల సమయంలో భక్తులతో కిటకిటలాడడంతోపాటు ఆలయం మొత్తం కూడా నిండిపోతూ ఉంటుంది.

అయితే ఇందులో కొరువు తీరి ఉన్న అమ్మవారికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. అదేమిటంటే గుడి నిండా ఏసీలు ఉంటాయట. ఆ ఏసీలను ఆపేస్తే అమ్మవారి దేహానికి చెమటలు పడతాయట. చాలామంది ఈ ఘటనను అద్భుతమైనదిగా భావిస్తారు. అలాగే కొంతమంది సైన్స్ తెలిసినవారు ఇందులో సైంటిఫిక్ రీజన్ కూడా ఉందని నమ్ముతూ ఉంటారు. ఇంకొందరైతే ఆలయంలో తేమ పరిమాణాలు ఉండడం కారణంగానే ఇలా చెమటలు పడుతున్నాయని భావిస్తారు. అయితే దీనికి సంబంధించిన అసలు కారణమైనది చాలామందికి ఎప్పుడు కొషన్ మార్క్ గానే ఉంది. కానీ స్థానికులు మాత్రం ఇది అమ్మవారి శక్తి స్వరూపమేనని గట్టిగా నమ్ముతున్నారు.

నిజానికి ఇలా అమ్మవారికి చెమటలు పట్టడం సంఘటనలు చాలా అరుదు అని మరి కొంతమంది నిపుణులు చెబుతున్నారు. ఇలా చెమటలు పట్టడం మాత్రం ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. ఈ ఆలయానికి ప్రతి మంగళవారం, సోమవారాలు భక్తులు పెద్ద సంఖ్యలో క్యూ కడుతూ ఉంటారు. వారి మొక్కలు చెల్లించుకొని అమ్మవారి దర్శనం చేసుకొని తిరుగు ప్రయాణం చేస్తారు. అలాగే చాలామందికి తెలియని విషయం ఏమిటంటే ఇక్కడ ఎవరు ఎలాంటి కోరికలు కోరుకున్న సులభంగా నెరవేరుతాయట. ఈ ఆలయం త్వరలోనే దేవాదాయ శాఖ పరిధిలోకి చేరే అవకాశాలు ఉన్నాయట.