భారతదేశంలో ఎన్నో ఆలయాలు క్షేత్రాలు ఉన్నాయి. వాటిలో ఒక్కొక్క గుడి ఒక్కొక్క విధమైన ప్రత్యేకతను విశిష్టతతో పాటుగా మిస్టరీలను కూడా కలిగి ఉన్నాయి. కొండలు, గుట్టలు నదుల ఒడ్డున ఇలా అనేక ప్రాంతాలలో దేవుడు ఆలయాలు ఉన్నాయి. అయితే ఈ ఆలయాలలో ఇప్పటికీ కొన్ని ఆలయాలు వీడని మిస్టరీగా సైన్స్ కు సైతం అంత చిక్కకుండా ఉన్నాయి. ఈ మిస్టరీని ఆయా దేవుళ్ళ యొక్క మహిమగా భక్తుల భావిస్తున్నారు. అటువంటి వాటిలో ఇప్పుడు మనం తెలుసుకోబోయే శివపార్వతుల ఆలయం కూడా ఒకటి.
కాగా భారతదేశంలో శివుడు, శక్తి స్వరూపిణి పార్వతి ఆలయాలు చాలా ఉన్నాయి. అలాంటి మిస్టరీ ఆలయాల్లో ఒకటి కొండమీద ఉన్న శివ పార్వతుల ఆలయం. ఈ ఆలయంలో కొన్ని క్షణాలు తీవ్రమైన వేడి ఉంటుందట. మరికొన్ని క్షణాల్లో విపరీతమైన చలి పెడుతున్న అనుభూతి చెందుతారట. ఒరిస్సాలోని శివాలయం అద్భుతమైన ఆలయం ఉంది. మిస్టరీ ఆలయం రాష్ట్రంలోని టిట్లాగఢ్‌లో ఉంది. దేశంలోని అత్యంత వేడిగా ఉండే ప్రాంతాలలో ఒరిస్సా కూడా ఒకటి. ఈ ఆలయం కుంహద పర్వతం మీద ఉంది. ఇక్కడ విపరీతమైన వేడి ఉంటుందట.
అయితే ఆలయం లోపల ఉష్ణోగ్రత చాలా తక్కువగా ఉంటుందని, బయట ఎంత వేడిగా ఉన్నా గుడి లోపల మాత్రం చలిగా ఉంటుందట. బయట ఎండల కారణంగా చెమటలు పడితే గుడి లోపల మాత్రం చలి దెబ్బకు వణికి పోవాల్సిందేనట. ఆలయ బయట వేడి పెరిగే కొద్దీ గుడి లోపల ఉష్ణోగ్రత తగ్గుముఖం పడుతుందట. ఒకొక్కసారి దుప్పట్లు కప్పుకోవాల్సిన పరిస్థితి కూడా ఉంటుందట. ఇలా ఎందుకు జరుగుతుందో ఎవరికీ తెలియదు. ఇది దైవం మహిమా లేక ప్రకృతి అద్భుతమా అనేది అర్థం చేసుకోవడం ఎవరికైనా కష్టమే. ఇప్పటికి ఇది మిస్టరీగానే ఉంది.