ఛత్తీస్‌గఢ్ దుర్గ్ జిల్లాలోని దేవ్‌బలోడాలో ఉన్న ఈ పురాతన శివాలయం భక్తులకు విశ్వాసంగా ఉందని చెప్పాలి. భక్తులు పరమేశ్వరుడు అక్కడ స్వయంగా వెలిసినట్టు చెబుతారు. కాలం మారినా కూడా అక్కడ ప్రజల విశ్వాసం నమ్మకం మాత్రం మారలేదు. అంతేకాకుండా కొన్ని సంవత్సరాలు గడిచిపోయిన ఇక్కడ భక్తుల రద్దీ మాత్రం ఏ మాత్రం తగ్గడం లేదు. ప్రతి ఏడాది మహా శివరాత్రి పర్వదినం రోజున భారీ సంఖ్యలో భక్తులు పరమేశ్వరుడిని దర్శనం చేసుకోవడం కోసం భక్తులు భారీగా క్యూ కడతారట.
అలా ఆ సమయంలో ఆలయ ప్రాంగణం శివయ్య నామ స్మరణతో మారుమ్రోగుతూ ఉంటుంది. భక్తులు విశ్వాసంతో శిరసు వంచి శివయ్యను కొలుస్తారట. ఆ శివయ్యకు రక్షణగా ఇక్కడ పాములు ఉంటాయని స్థానికులు చెబుతున్నారు. ఈ అద్భుతమైన విశ్వాస ప్రదేశం జిల్లా ప్రధాన కార్యాలయం నుంచి కేవలం 20 కిలో మీటర్ల దూరంలో ఉన్న దేవ్ బలోడాలోని దట్టమైన అడవుల మధ్య ఉందట. ఇది 13వ శతాబ్దపు నాటి శివాలయం. దీనిని కల్చురి రాజులు నిర్మించారని చెబుతారు. ప్రతి సంవత్సరం మహాశివరాత్రి రోజున ఇక్కడ ఒక పెద్ద జాతర జరుగుతుంది.
సుదూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు శివయ్యను దర్శనం చేసుకోవడానికి వస్తారు. అయితే ఈ ఆలయాన్ని నిర్మించిన శిల్పి నగ్నంగా ఉండి ఆలయాన్ని నిర్మించాడని ఒక పౌరాణిక నమ్మకం ఉంది. శిల్పి భార్య ఎప్పుడూ అతనికి ఆహారం తెచ్చేదట. అయితే ఆరవ నెలలో ఒక రాత్రి, శిల్పి భార్యకు బదులుగా అతని సోదరి అకస్మాత్తుగా ఆహారం తెచ్చిందట. నగ్నంగా ఉన్న అన్న చెల్లెల్ని చూసి శిల్పి కుండం లోకి దూకాడట. తన సోదరుడు చెరువులోకి దూకడం చూసిన సోదరి కూడా ఆలయం పక్కనే ఉన్న చెరువులోకి దూకిందట.
ఆ చెరువును కసారా చెరువు అని పిలుస్తారు ఎందుకంటే ఆమె తన సోదరుడికి ఆహారం తెచ్చినప్పుడు ఆమె తలపై ఆహారంతో పాటు ఒక కుండ నీరు కూడా ఉన్నదట. ఈ చెరువు, కుండం ఇప్పటికీ ఈ ఆలయంలో ఉందట. ఇది ప్రజలకు ఆకర్షణ కేంద్రంగా ఉంది. శిల్పి దూకినందున ఆలయ పని పూర్తి కాలేదని, పై భాగం నేటికీ అసంపూర్ణంగా ఉన్నందున ఈ అన్నా చెల్లెలుకి సంబంధించిన సంఘటన జరిగినట్లు ఆధారాలు కూడా దొరికాయని చెబుటున్నారు. ఈ ఆలయ ప్రాంతంలో దాదాపు ఏడాది పొడవునా నీరు లభిస్తూనే ఉంటాయట.