Site icon HashtagU Telugu

Chindi Mata Mandir: చీమలు తయారు చేసిన ఆలయం, సంతానం లేని వారికి సంతానం.. ఎన్నో మహిమలు!

Chindi Mata Mandir

Chindi Mata Mandir

హిమాచల్ ప్రదేశ్ లోని కరోగ్స్ కొండల మధ్య చిండి మాత అనే అమ్మవారి ఆలయం ఉంది. ఈ అమ్మవారు ఎన్నో రహస్యాలతో నిండి ఉంది. కాగా ఈ ఆలయం సిమ్లాకు వెళ్లే మార్గంలో కర్సోగ్ నుంచి 13 కి.మీ దూరంలో ఉందట. ఈ ఆలయం చాలా పురాతనమైనదట. ఈ ఆలయానికి దేశ విదేశాల నుంచి కూడా వస్తూ ఉంటారట. చిండి మాత అమ్మవారు ఎనిమిది చేతులతో దర్శనం ఇస్తారు. ఈ రాతి విగ్రహం, ఈ ఆలయంపై ప్రజల విశ్వాసం. పిల్లలు లేని దంపతులకు సంతానాన్ని వరంగా ఇస్తుందని నమ్మకం. ఈ ఆలయానికి ఉన్న మరొక ప్రత్యేకత ఏమిటంటే ఈ ఆలయ పటాన్ని చీమలు తయారు చేశాయట.

కాగా పురాణాల ప్రకారం చిండి మాత ఆలయ బ్లూప్రింట్ ఏ మానవ చేతితోనూ రూపొందించబడలేదట. శ్రమజీవులైన చీమల బృందంతో రూపొందించబడిందట. మాతా రాణి స్వయంగా ఒక కన్య రూపంలో కనిపించి చీమలు తయారు చేసిన పటాన్ని ఉపయోగించి ఆలయ నిర్మాణాన్ని స్వయంగా పర్యవేక్షించిందట. ఆలయ రూపకల్పనకు సంబంధించిన వివరాలు పూజారికి కలలో కనిపించి అమ్మవారు సమాచారం అందించిందట. ఆలయం తదనుగుణంగా నిర్మించబడిందట. ఇది మాత్రమే కాదు ఆ తరువాత ఆలయానికి ఆనుకుని ఉన్న చెరువు, నిల్వ గృహాన్ని కూడా చీమలు జాగ్రత్తగా ప్లాన్ చేశాయిట. ఇది ఆలయ ఆధ్యాత్మిక ప్రకాశాన్ని పెంచుతుందని చెబుతున్నారు.

కాగా ఈ ఆలయం చెక్కతో తయారు చేయబడింది. చాలా ఆకర్షణీయంగా అందంగా కనిపిస్తుంది. ఈ ఆలయంలో అనేక అంతస్తులు ఉన్నాయి. కుటుంబ దేవతల చిహ్నాలు పైకప్పులపై చెక్కబడి ఉన్నాయి. పై కప్పుకు బర్క్స్ కలపతో చేసిన జింక తల ఉంది. పైకప్పు నుంచి ఎగురుతున్న గద్దలు కూడా చూడవచ్చట. దాని ప్రధాన ద్వారం వద్ద చెక్క పులుల విగ్రహాలు ఏర్పాటు చేయబడ్డాయి. అవి ఆలయానికి కాపలా కాస్తున్నట్లు అనిపిస్తుందట. కాగా గర్భగుడి గోడలపై హిందూ గ్రంథాల గుర్తులు కనిపిస్తాయట. ఈ ఆలయం వెలుపల ఒక మెట్ల బావి కూడా ఉందటీ. ఇది ఆలయాన్ని మరింత ప్రత్యేకంగా చేస్తుందని చెబుతున్నారు. చాలామంది దంపతులకు ఈ ఆలయం సందర్శించిన తర్వాత సంతానం కలిగిందట. ఆగస్టు 2 నుంచి 4 వరకు చిండి మాత ఉత్సవం జరుగుతుందట. ఈ రోజుల్లో అమ్మవారు తన భక్తులకు దర్శనం ఇవ్వడానికి బయటకు వస్తుందట. ఈ సమయంలో అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తారట. అలా చండి అమ్మ సంవత్సరానికి రెండుసార్లు మాత్రమే బయటకు వస్తుందట.