Site icon HashtagU Telugu

Vastu Tips: పిల్లలలో ఏకాగ్రతను పెంచాలంటే ఈ వాస్తు చిట్కాలను పాటించాల్సిందే!

Children Vastu Tips

Children Vastu Tips

Vastu Tips: మన భారతీయ శాస్త్రాలలో వాస్తు శాస్త్రానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. భారతీయులు వాస్తు శాస్త్రాన్ని ఎంతో విశ్వసిస్తారు. అయితే మనం చేసే ప్రతి ఒక్క పనిలోనూ తప్పనిసరిగా వాస్తును గమనించి, వాస్తు శాస్త్రానికి అనుగుణంగా నడుచుకుంటారు. ఇకపోతే మన ఇంట్లో పిల్లలు చదువుపై దృష్టి పెట్టకుండా చదువు విషయంలో ఏకాగ్రత కనబరచకపోతే వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని చిట్కాలను పాటించడం వల్ల పిల్లలలో ఏకాగ్రత పెరుగుతుంది. మరి పిల్లల విషయంలో ఎలాంటి వాస్తు చిట్కాలను పాటించాలి అనే విషయానికి వస్తే…

మీ పిల్లలు చదువుపై ఏకాగ్రత పెట్టలేకపోతున్నారంటే వాళ్లు వాయువ్య, నైరుతి లేదా తూర్పు ఆగ్నేయం వంటి ప్రతికూల ప్రదేశాలలో చదువుతున్నారని అర్థం.ఇలాంటి ప్రదేశాలలో చదవటం వల్ల పిల్లలు ఏకాగ్రతను కోల్పోతారు. అందుకే పిల్లలు చదివేటప్పుడు దక్షిణ దిశలో కూర్చుని చదువుకోవడం మంచిది. ఇక పిల్లలు చదువుకోవడానికి వేసుకున్న టైం టేబుల్ ఎల్లప్పుడూ పశ్చిమ నైరుతి వైపు ఉండాలి. ఇక పిల్లలు చదువుకునే గదిలో ఎల్లప్పుడూ క్రీమ్ లేదా తెలుపు రంగును వేయడం మంచిది.

ఇకపోతే పిల్లలలో మానసిక స్పష్టత రావాలన్న తెలివితేటలు అభివృద్ధి చెందాలన్న ఈశాన్య దిశ ఎంతో ముఖ్యం ఈ దిశలో ఎల్లప్పుడూ తెలుపు రంగు వేసి గోడలకు స్వస్తిక్ చిహ్నాలను వేలాడదీయడం వల్ల పిల్లలలో మానసిక ఎదుగుదల, తెలివితేటలు అభివృద్ధి చెందుతాయి. ఇక నైరుతి దిశలో పిల్లలు వారి గురువుల ఫోటోలను లేదా పూర్వికులు ఫోటోలను ఈ దిశలో ఉంచడం వల్ల వారి ఆశీర్వాదం పిల్లలపై ఉంటుంది ఇక ఈ దిశలో పెన్ స్టాండ్ వంటి వాటిని పెట్టుకోవడం మంచిది ఇక పుస్తకాల అరలను కూడా ఈ దిశలో పెట్టుకోవడం వల్ల పిల్లలలో చదువుపై ఏకాగ్రత కలుగుతుంది. ఇలా ఈ వాస్తు చిట్కాలను పాటించడం వల్ల పిల్లలలో ఏకాగ్రత కలుగుతుందని వాస్తు శాస్త్రం తెలియజేస్తుంది.

Exit mobile version