Shani Dev: శని అనుగ్రహం కావాలంటే.. ఈ పద్ధతులు పాటించాల్సిందే!

Shani Dev: సాధారణంగా దేవుళ్లను పూజించేటప్పుడు భక్తి శ్రద్ధలతో పూజించాలి అలాగే కొన్ని రకాల నియమాలు పాటించాలి అని చెబుతూ ఉంటారు.

  • Written By:
  • Updated On - October 18, 2022 / 06:44 AM IST

Shani Dev: సాధారణంగా దేవుళ్లను పూజించేటప్పుడు భక్తి శ్రద్ధలతో పూజించాలి అలాగే కొన్ని రకాల నియమాలు పాటించాలి అని చెబుతూ ఉంటారు. అలాగే శనీశ్వరుడిని పూజించేటప్పుడు కూడా కొన్ని రకాల నియమాలను తప్పకుండా పాటించాలట.. లేదంటే శనీశ్వరుని పూజించిన ఫలితం కాకుండా శనీశ్వరునికీ కోపం తెప్పించినట్టు అవుతుంది. మరి ఏ సమయంలో ఎటువంటి పనులు చేయాలో? ఏ సమయంలో ఎటువంటి పనులు చేయకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. సాధారణంగా శని దేవుని గ్రహ ప్రభావం అలాగే శనీశ్వరునికి సంబంధించిన ఎటువంటి గ్రహ దోషాలు ఉండకూడదు అనే భక్తిశ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు. మరి అటువంటప్పుడు ఇటువంటి నియమాలు తప్పక పాటించాలి.

శనీశ్వరునికి పూజ చేసే సమయంలో ఒంటి పై ధరించే దుస్తుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. పూజ చేసే సమయంలో ఎరుపు రంగు దుస్తులు కాకుండా శనీశ్వరునికి ఇష్టమైన నలుపు నీలం రంగు దస్తులు ధరించాలి. అలాగే శనీశ్వరుడి ఆలయానికి వెళ్ళినప్పుడు ఎప్పుడు కూడా శని దేవునికి ఎదురుగా నిల్చుని పూజించకూడదు. పూజ ముగిసిన తర్వాత వెళ్ళిపోయేటప్పుడు శనీశ్వరుడికి వీపు చూపించకుండా అలాగే నడుచుకుంటూ వెనక్కి వెళ్ళిపోవాలి. అలా కాకుండా వెన్ను చూపించి పోవడం వల్ల శనీశ్వరునికి కోపం వస్తుంది. అలాగే శనీశ్వరుని పూజించే సమయంలో ఆలయానికి వెళ్ళిన వారు శనీశ్వరుని కళ్లలోకి చూడకూడదు. పూజ సమయంలో కళ్ళు మూసుకుని ఉండాలి. లేదంటే ఆయన పాదాల వైపు మాత్రమే చూస్తూ ఉండాలి.

మరీ ముఖ్యంగా శని దేవుని కళ్ళల్లోకి కళ్ళు పెట్టి అనగా ఆయన కళ్ల వైపు తదేకంగా అలాగే అసలు చూడకూడదు. అలాగే శనీశ్వరుని పూజించే సమయంలో దిశను కూడా బాగా గుర్తుంచుకోవాలి. ఎప్పుడు కూడా తూర్పుముఖంగా కూర్చుని పూజలు చేస్తూ ఉంటారు. అలా చేయకూడదు. శనీశ్వరునికి పూజ చేసేటప్పుడు ఎప్పుడైనా కానీ ఆలయంలో పశ్చిమంగా ముఖం ఉంచి పూజించాలి. అలాగే శనీశ్వరుడికి నూనె సమర్పించేందుకు రాగి పాత్రను కాకుండా ఇనుము మాత్రమే ఉపయోగించాలి. ఎందుకంటే రాగి అనేది సూర్యునికి ఎంతో ఇష్టమైన పాత్ర. సూర్యుడు శని దేవుడు శత్రువులు కాబట్టి శని దేవునికి రాగి అంటే అసలు నచ్చదు.