God Shani: శని దేవుడిని పూజించేటప్పుడు ఈ నియమాలు పాటించాల్సిందే.. లేకపోతే అంతే సంగతులు?

చాలా మంది శనీశ్వరుడు పేరు వినగానే భయపడిపోతూ ఉంటారు. శని దేవుడికి గుడికి వెళ్లాలి అన్న పూజ చేయాలి అని భయపడుతూ ఉంటారు. కానీ కొంతమంది మాత్రం శని దేవుడిని పూజిస్తూ ఉంటారు. మరి శని దేవుడిని పూజించే వాళ్ళు ఎటువంటి నియమాలు

  • Written By:
  • Publish Date - September 14, 2022 / 07:00 AM IST

చాలా మంది శనీశ్వరుడు పేరు వినగానే భయపడిపోతూ ఉంటారు. శని దేవుడికి గుడికి వెళ్లాలి అన్న పూజ చేయాలి అని భయపడుతూ ఉంటారు. కానీ కొంతమంది మాత్రం శని దేవుడిని పూజిస్తూ ఉంటారు. మరి శని దేవుడిని పూజించే వాళ్ళు ఎటువంటి నియమాలు పాటించాలి. పాటించకపోతే ఎటువంటి అనర్తాలు జరుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. శని దేవుడిని పూజించే సమయంలో తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే ఆ వ్యక్తి శని దేవుని కోపానికి గురవ్వక తప్పదు. పూజ చేసే సమయంలో ఒంటి పై ధరించే దుస్తుల రంగుల విషయంలోనూ చాలా జాగ్రత్తగా ఉండాలి.

పూజకు ఎరుపు రంగు దుస్తులు ధరించే అలవాటు ఉంటే వెంటనే మార్చుకోవాలి. పూజ సమయంలో కచ్చితంగా శని దేవునికి ఇష్టమైన నీలం, నలుపు రంగు దుస్తులు ధరించడం మంచిది. శని దేవుడికి వెన్ను చూపకూడదు. శని దేవుడిని పూజించేటప్పుడు ఎప్పుడూ ఎదురుగా నిల్చొని ఉండకూడదు. శని దేవుని పూజ ముగిసిన తర్వాత ఎక్కడికి వెళ్లినా నిలబడి ఉన్న స్థానం నుంచి అలాగే వెనక్కు వెళ్లిపోవాలీ. శని దేవుడిని పూజించడానికి ఆలయానికి వెళ్లినప్పుడు పూజ సమయంలో శని దేవుడి కళ్లలోకి చూడకూడదు. శని ని పూజించే సమయంలో కళ్లు మూసుకుని ఉండండి. లేదంటే ఆయన పాదాల వైపు చూస్తూ ఉండండి.

శని దేవుడిని ఆరాధించే సమయంలో పూజలో కూర్చునే దిశపై కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. సాధారణంగా తూర్పు ముఖంగా పూజలు చేస్తుంటారు. కానీ శని దేవుడు పశ్చిమానికి అధిపతి అని చెబుతుంటారు. కాబట్టి ఆయనను పూజించేటప్పుడు పూజలో పాల్గొనే వారి ముఖం పడమర వైపు ఉండాలి. కాబట్టి శనీశ్వరుడికి పూజ చేసేటప్పుడు ఈ నియమాలను పాటించాలి. లేదంటే శనీశ్వరుడి కోపానికి మనం కారణం అవుతాం.