Site icon HashtagU Telugu

Saturday: సంతోషంగా ఉండాలంటే శనివారం రోజు ఎలాంటి పనులు చేయకూడదో మీకు తెలుసా?

Saturday

Saturday

వారంలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవుడికి అంకితం చేయబడింది. అయితే ఈ రోజుల్లో తెలిసి తెలియక చేసే తప్పులు వల్ల అనేక రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని అంటున్నారు పండితులు. అలా శనివారం రోజు శనీశ్వరుడికి అంకితం చేయబడింది. ఈ శనివారం రోజున శనీశ్వరున్ని అత్యంత భక్తిశ్రద్ధలతో పూజించడం వల్ల ఆయన అనుగ్రహం తప్పకుండా పొందవచ్చు. అలాగే తెలిసి తెలియకుండా కూడా ఈ రోజున కొన్ని తప్పులు అస్సలు చేయకూడదట. మరి శనివారం రోజు ఎలాంటి తప్పులు చేయకూడదు అన్న విషయానికి వస్తే..

శనివారం రోజు ఉప్పు కొనుగోలు చేయడం అసలు మంచిది కాదట. ఇలా చేయడం వల్ల మీరు అప్పుల పాలు అయ్యే అవకాశం ఉందనీ చెబుతున్నారు. అలాగే ఆ రోజున వేరొకరి ఇంటి నుంచి ఉప్పు తీసుకోవడం మంచిది కాదట. అలాగే శనివారం ఇనుము కొనుగోలు చేయకూడదట. ఇనుప కుండ అయినా, కడ్డీ అయినా, ఇనుముతో చేసిన ఏ వస్తువు అయినా ఈ రోజున కొనడం అశుభం అని, ఇలా చేయడం వల్ల శనిదేవుడికి కోపం వస్తుందని చెబుతున్నారు. అదేవిధంగా శనివారం రోజు చెప్పులు లేదా బూట్లు కొనుగోలు చేయడం అస్సలు మంచిది కాదట. ఇలా చేస్తే మీరు చేసే పనులలో ఆటంకం ఏర్పడవచ్చు అని అనుకున్న పనులు కూడా సగంలో ఆగిపోవచ్చు అని చెబుతున్నారు.

అదేవిధంగా శనివారం బట్టలు కొనడం మంచిది కాదట. ఈ రోజున మీరు బట్టలు కొనుగోలు చేస్తే లేదా షాపింగ్ చేస్తే మీ జీవితంలో మంచి ఫలితాలు వస్తాయని, కాబట్టి ఇకపై శనివారం బట్టలు కొనకపోవడమే మంచిదని చెబుతున్నారు. శనివారం రోజు శనీశ్వరుడి అనుగ్రహం కలగాలి అంటే ఉప్పు చీపురు నల్లటి వస్త్రాలు దుప్పట్లు వంటి విధానం చేయవచ్చట. కానీ ఇతర రంగుల దుస్తులను మాత్రం దానం చేయకూడదని చెబుతున్నారు. శనిదేవుని అనుగ్రహం పొందడానికి, మీరు శనివారం ఎవరితోనూ గొడవలకు దిగకుండా ఉండాలట. ఈ రోజున నువ్వులు, ఇనుము, ఆవనూనె దానం చేయాలని, దీనివల్ల అంతా శుభం కలుగుతుందని పండితులు చెబుతున్నారు.