Ram Mandir: జై శ్రీరామ్‌ నామాలతో ముస్తాబైన ముఖేష్ అంబానీ ఆంటిలియా

భారతదేశ చరిత్రలో నేడు మరో అధ్యాయం చేరబోతోంది. నేడు అయోధ్యలో రాంలాలా విగ్రహ ప్రతిష్ఠతో చరిత్ర సృష్టించనున్నారు. ఈ తరుణం కోసం సనాతనీయులతో పాటు యావత్ దేశం ఎంతో కాలంగా ఎదురుచూసింది.

Ram Mandir: భారతదేశ చరిత్రలో నేడు మరో అధ్యాయం చేరబోతోంది. నేడు అయోధ్యలో రాంలాలా విగ్రహ ప్రతిష్ఠతో చరిత్ర సృష్టించనున్నారు. ఈ తరుణం కోసం సనాతనీయులతో పాటు యావత్ దేశం ఎంతో కాలంగా ఎదురుచూసింది. ఈ రోజు భగవంతుడు అయోధ్యలో నిర్మిస్తున్న రామమందిరంలో కూర్చుని భక్తులకు దర్శనం ఇవ్వబోతున్నాడు. భారత ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా రాంలాలా విగ్రహాన్ని సరైన స్థలంలో ఏర్పాటు చేయనున్నారు.

ఈ రోజు అయోధ్య రామాలయంలో ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం సందర్భంగా దేశంంలోని అనేక ఆలయాలు, ఆధ్యాత్మిక కేంద్రాలు అందంగా ముస్తాబవుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత వ్యాపార దిగ్గజం ముఖేష్ అంబానీ ఇళ్లు కూడా అందంగా అలంకరించారు. అంబానీ తన ఇళ్ళు ఆంటిలియా ను జై శ్రీరామ్‌ నామాలతో అందంగా అలంకరించారు. 27 అంతస్తుల ఇంట లోపల, వెలుపల కూడా హిందూ మతతత్వం ఉట్టిపడేలా శ్రీరామునికి చెందిన చిహ్నాలు, చిత్రాలు ఏర్పాటు చేశారు. శనివారం సాయంత్రం ఆయన ఇంటి పై జై శ్రీరామ్‌ అనే నినాదాలు కనిపించాయి. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

మధురలోని శ్రీకృష్ణ జన్మస్థలంలో ఠాకూర్ కేశవదేవ్ రామునిగా కనిపిస్తుండగా, భగవత్ భవన్‌లో రాధా-కృష్ణులు కూడా సియారామ్‌గా కనిపిస్తారు. తలపై బంగారు కిరీటం, రత్నాలు పొదిగిన బంగారు, వెండి ఆభరణాలు, చేతిలో వెండి ధనుస్సు ధరించి ఠాకూర్ బంకే బిహారీ పురుషోత్తం శ్రీరాముడి వేషంలో భక్తులకు దర్శనం ఇస్తారని ఆలయ సేవాయత్ ఆచార్య గోపీ గోస్వామి తెలిపారు.

అయోధ్యలో రామమందిర ప్రాణ్ ప్రతిష్టా వేడుకకు ముందు అమెరికాలోని టైమ్స్ స్క్వేర్‌లో ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ రామ్ మందిర్ సభ్యులు లడ్డూలను పంపిణీ చేశారు. ఈ జన్మలో ఈ రోజు చూస్తామని అనుకోలేదని అమెరికాలో ఉంటున్న ప్రేమ్ భండారీ అన్నారు. మరికాసేపట్లో అయోధ్యలో రామమందిర శంకుస్థాపన జరగనుంది. దీంతో టైమ్స్ స్క్వేర్‌లో కూడా ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఈ క్షణం కోసం ఎదురు చూస్తున్నారు.

Also Read: Ram Mandir Photos : ముస్తాబైన అయోధ్య రామమందిరం.. ఫొటోలు, ప్రారంభోత్సవ విశేషాలివీ