Site icon HashtagU Telugu

Muharram: 17న మొహర్రం.. ఈ పండుగ చరిత్ర, సందేశం ఇదీ..

Muharram 2024

Muharram:  మొహర్రం పండుగను ఈనెల 17న ముస్లింలు జరుపుకోబోతున్నారు. వాస్తవానికి మొహర్రం అనేది ఇస్లామిక్ క్యాలెండర్‌లోని మొదటి నెల పేరు. ఇస్లామిక్ క్యాలెండర్‌లో మొత్తం 12 నెలలు ఉంటాయి. మొహర్రం అంటే నిషిద్ధం, పవిత్రత, మహోన్నతమైంది అనే అర్థాలు ఉన్నాయి. ముస్లింల పవిత్ర గ్రంథం ఖురాన్‌‌లో పేర్కొన్న నాలుగు పవిత్ర నెలల్లో మొహర్రం కూడా ఒకటి. నెలవంక దర్శనంతో ఇస్లామిక్ క్యాలెండర్‌లోని మొదటి నెల మొహర్రం(Muharram) ప్రారంభమవుతుంది. మొహమ్మద్‌ ప్రవక్త మక్కాను వదిలి మదీనాకు వలస వెళ్లిన ఏడాదితో ఇస్లామిక్  కాలెండరు ప్రారంభమవుతుంది.

We’re now on WhatsApp. Click to Join

వలస వెళ్లడాన్ని అరబిక్ భాషలో ‘హిజ్రత్’ చేయడం అని పిలుస్తారు.  అందుకే ఇస్లామిక్ క్యాలెండర్‌ను హిజ్రీ క్యాలెండర్ అని కూడా పిలుస్తారు. హజ్రత్‌ అలీ(రజి) సలహా మేరకు హజ్రత్‌ ఉమర్‌ ఫారూఖ్‌ (రజి) పాలనా కాలంలో హిజ్రీ క్యాలెండర్‌ను రూపొందించారు. ఇంగ్లీషు కాలెండర్‌లో ఏడాదిలో 365 రోజులు ఉంటే, హిజ్రీ కాలెండర్‌లో 354 రోజులు ఉంటాయి.నెలల సంఖ్య పన్నెండే అయినప్పటికీ ఆంగ్ల కాలెండర్‌లా కాకుండా హిజ్రీ కాలెండర్‌లో నెలలో 29 లేదా 30 రోజులుంటాయి. ముస్లిములు తమ ధార్మిక అవసరాలకు చాంద్రమాన క్యాలెండరునే అనుసరిస్తారు. రంజాన్, బక్రీద్ పండుగలు కూడా నెలవంక దర్శనంమీదే ఆధారపడి ఉంటాయి.

Also Read :Papaya During Pregnancy: ప్రెగ్నెన్సీ సమయంలో బొప్పాయి తింటే గ‌ర్భ‌స్రావం అవుతుందా..? అస‌లు నిజం ఇదే..!

రంజాన్‌ నెలలో ముస్లింలు నిష్ఠతో ఉపవాసాలు పాటిస్తారు. ముస్లింలు ఉపవాసాలు పాటించే మరో పవిత్రమైన  నెల మొహర్రం. ఈనెలలో 10వ తేదీని యౌమె ఆషురా అని పిలుస్తారు. ఆ రోజున ఉపవాసం పాటిస్తే గతేడాది చేసిన పాపాలన్నీ తుడిచి పెట్టుకుపోతాయని నమ్ముతారు. మొహమ్మద్‌ ప్రవక్త మనవడు హజ్రత్‌ ఇమామె హుసేన్‌ (రజి) యుద్ధంలో అమరుడైంది కూడా యౌమె ఆషూరా రోజునే. అందుకే ఆ  రోజున పవిత్రమైనదిగా భావించి.. సంతాపాన్ని పాటిస్తూ ఉపవాసం ఉంటారు. హుసైన్‌ (రజి) త్యాగస్ఫూర్తిని గుర్తు చేసుకుంటారు. వందల ఏళ్ల క్రితం ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఇమామె హుసేన్‌ (రజి) ‘కర్బలా’ మైదానంలో వీరోచితంగా పోరాడి అసువులు బాసిన ఘటనను ముస్లింలు గుర్తుచేసుకుంటారు.

Also Read :KL Rahul: జూలై 27 నుంచి శ్రీలంక ప‌ర్య‌ట‌న‌.. వ‌న్డేల‌కు కేఎల్ రాహుల్‌, ట్వీ20ల‌కు హార్దిక్ పాండ్యా..?

గమనిక : కొందరు నిపుణులు చెప్పిన, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా పైన ఉన్న సమాచారాన్ని అందించాం. దీనికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని రీడర్స్ గమనించాలి. దీన్ని ఎంత వరకు విశ్వసించాలనేది మీ వ్యక్తిగత విషయం.