Muggu: ఇంటి ముందు ముగ్గులో పసుపు కుంకుమ వేస్తున్నారా.. అయితే ఈ విషయాల గురించి తెలుసుకోవాల్సిందే?

హిందువులు ఉదయాన్నే నిద్ర లేచి కల్లాపు చల్లి ఇంటి ముందు ముగ్గులు పెడుతూ ఉంటారు. అయితే కొంతమంది ముగ్గు వేసిన తర్వాత అందులో పసుపు కుంకు

  • Written By:
  • Publish Date - December 25, 2023 / 04:00 PM IST

హిందువులు ఉదయాన్నే నిద్ర లేచి కల్లాపు చల్లి ఇంటి ముందు ముగ్గులు పెడుతూ ఉంటారు. అయితే కొంతమంది ముగ్గు వేసిన తర్వాత అందులో పసుపు కుంకుమ వేస్తే మరికొందరు పైన పువ్వులు వంటివి కూడా వేస్తూ ఉంటారు. అయితే ముగ్గులో పసుపు, కుంకుమ వేయడం కరెక్టేనా. ఒకవేళ వేస్తే ఏం జరుగుతుంది? అసలు ముగ్గులు కుంకుమ పసుపు వేయవచ్చా? ఈ విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ముగ్గులను రెండు కలిపిన మిశ్రమంతో కూడా వేసేటటువంటి పద్ధతి ఉంది. ఇంట్లో తులసి కోట దగ్గర పసుపు రాసిన గుమ్మాలు ఈ విధంగా పిండితోనే వేయడం సంప్రదాయంగా వస్తుంది.

అయితే ఇంటి బయట పెరట్లో ఇంకా ఇతర ప్రదేశాలలో వేసే ముగ్గులు ముగ్గుతో వేయడం అలవాటు అయితే వీధుల్లో చెత్త చెదారం పేరుకుపోయి మురికి దోమలు ఇంకా నుసములు ఇలాంటివి వ్యాపించకుండా ఉండేందుకు గ్రామపంచాయతీ వారు గాని మున్సిపాలిటీ వాళ్లు గానీ మురికివాడలలో గుళ్ళ ముగ్గు చల్లడం కూడా అందరికీ తెలిసిన విషయమే ఎందుకంటే ఈ గుల్ల ముగ్గు అనేది చాలా ఘాటుగా ఉంటుంది. ఈ ముగ్గులలో ముఖ్యంగా ఇంటి ముందు వేసేటటువంటి ఈ ముగ్గులలో పసుపు, కుంకుమ వేస్తూ ఉంటారు.

చాలామంది మరి ఈ విధంగా ఇంటి ముందు వేసే ముగ్గులు పసుపు, కుంకుమ వేయవచ్చా అంటే నూటికి నూరు శాతం వేయకూడదు. ఎందుకంటే పసుపు కుంకుమను మనం ఎన్నో శుభకార్యాలలో ఉపయోగిస్తూ ఉంటాం. అలాంటి పసుపు కుంకుమ కచ్చితంగా వీధిలో వేయడం వల్ల వాటిని ఎంతోమంది తొక్కుతూ ఉంటారు. అలా తొక్కిన కూడా అది అశుభమే కనుక కచ్చితంగా పసుపు కుంకుమను ఇంటి ముందు వేసే గుమ్మంలో ఎట్టి పరిస్థితుల్లోనూ వేయకూడదు. ఇక అదే విధంగా పసుపును కుంకుమను ఎక్కువగా మనం ఇంట్లో వేసుకునే ముగ్గులు అంటే భగవంతుడికి ఎదురుగుండా పిండి బియ్యం వేస్తాం కదండీ పిండి బియ్యంతో అలా పిండి బియ్యంతో వేసేటటువంటి ముగ్గులు పసుపు కుంకాన్ని అలంకరించుకోవచ్చు. అలాగే పూలు కూడా పెట్టుకోవచ్చు. కానీ బయట అంటే వీధిలో వేసేటటువంటి ముగ్గులు పసుపు, కుంకుమను అస్సలు వాడకూడదు.