Site icon HashtagU Telugu

Zodiac Signs: శని, గురుగ్రహాల వక్ర మార్గం.. నవంబర్ దాకా బీ అలర్ట్!!

Star Signs Imresizer

Star Signs Imresizer

బీ అలర్ట్ !!

వచ్చే అక్టోబరు, నవంబరు వరకు కొన్ని రాశుల వారికి పరీక్ష కాలమే!!

ఈ టైం వరకు అలర్ట్ గా లేకుంటే ఆపదలు ఎదురయ్యే ముప్పు ఉంటుంది.

శని గ్రహం ఈ ఏడాది జూన్ నెల 5వ తేదీ నుంచే వక్ర మార్గంలో నడుస్తోంది. శని వక్రం దాదాపు 141 రోజుల వరకు.. అంటే 2022 సంవత్సరం అక్టోబర్ 23న ఉదయం 09.37 గంటల దాకా వక్రంలో సంచరిస్తుంది. ఆ తర్వాత తిరిగి శని తన సక్రమమైన మార్గంలో ప్రవేశిస్తుంది. శని వక్రీకరణ వల్ల కొన్ని రాశుల వారు తీవ్ర ప్రభావానికీ లోనవుతారు. మరోవైపు బృహస్పతి గ్రహం జూలై 29న మీనంలో తిరోగమనంలోకి ప్రవేశిస్తోంది. ఈ తిరోగమన స్థితి నవంబర్ 24 వరకు కొనసాగుతుంది.

శని వక్రించడంతో ప్రభావితమయ్యే రాశులు..

* కర్కాటకం : ఈ రాశి వాళ్లు ఈ సమయంలో చేస్తోన్న పనిలో విజయం సాధించడానికీ ముందు కంటే ఎక్కువ కష్టపడాలి. ఓర్పు పట్టుదలతో పనిచేయాలి. ఇతరులతో వాదనలు చేయడం మానుకోవాలి.

* సింహ రాశి : ఈ రాశి వాళ్లలో ఆత్మ విశ్వాసం మునుపటి స్థాయిలో ఉండదు. కెరీర్ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఈ సమయంలో ఆర్ధిక సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

* కన్యారాశి : వీరు చేసే వృత్తి, వ్యాపార విషయాల్లో అప్రమత్తత అవసరం. డబ్బు విషయంలో జాగ్రత్తగా వ్యవహరించడం ఎంతో ఆవశ్యకం.

* వృశ్చిక రాశి : ఈ రాశి వాళ్లపై
చెడు ప్రభావం ఎక్కువగా ఉంటుంది. శని దోషాలను నివారించడానికి, మీరు శనివారం శని దేవుడికి నువ్వుల నూనెతో దీపం పెట్టి.. నల్ల నువ్వులను నైవేద్యంగా సమర్ఫించాలి. ఇలా చేస్తే శనీశ్వరుడు ఎంతో సంతోషిస్తాడు.

మకరరాశి : శని వక్రం వల్ల ఈ రాశి వారిపై మిశ్రమ ప్రభావం ఉంటుంది. మకర రాశికి అధిపతి శనీశ్వరుడు. సొంత ఇళ్లు కాబట్టి ఈ రాశి వారిపై శని ప్రభావం తక్కువగా ఉంటుంది.

కుంభ రాశి : శని తిరోగమన ప్రభావం కుంభ రాశిపై ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో ఈ రాశి వారు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలి. కుంభరాశికి కూడా శనీశ్వరుడు అధిపతి కాబట్టి.. ఈ రాశి వారికీ శని ప్రభావం తక్కువగా ఉంటుంది. ఈ రాశి వారు శని ప్రభావం తప్పించుకోవడానికీ శనివారం నాడు స్నానమాచరించి శనీశ్వరుడికి పూజలు చేయాలి.

గురువు వక్రించడంతో ప్రభావితమయ్యే రాశులు..

దేవ గురువు బృహస్పతికి నవ గ్రహాల్లో ప్రత్యేక స్థానం ఉంటుంది. గురు బలం వల్ల విద్యా, ఉపాధి అవకాశాలకు అధిపతి. ఆయన అనుగ్రహం లేనిదే ఏ పనినీ చేయలేము. ఈయన కుమారుడు, జీవిత భాగస్వామి, సంపద, విద్య, కీర్తి కారకుడిగా జ్యోతిష్య శాస్త్రంలో గురువుకు ప్రత్యేక స్థానం ఉంది. గురువు వక్రించడంతో ప్రభావితమయ్యే రాశుల గురించి తెలుసుకుందాం..

* సింహ రాశి : సింహరాశికి అధిపతి సూర్యుడు. ఈ కాలంలో వీరు ఆరోగ్య సంబంధిత సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆర్థిక పరమైన ఇబ్బందులను చూడాల్సి వస్తుంది. ఈ రాశి వాళ్ళు అనుకున్న బడ్జెట్ పెరిగి.. ఋణ గ్రస్తులుగా మారే అవకాశం ఉంది. ఉద్యోగంలో సమస్యలు రావచ్చు. కాబట్టి పై అధికారులతో సామరస్య పూర్వకంగా వ్యవహరించండి.

* తులా రాశి : ఈ రాశికి శుక్రుడు అధిపతి. గురువుకు వృత్తి రీత్యా శుక్రుడు శత్రువుగా పరిగణింపబడతాడు. బృహస్పతి గ్రహం వక్ర గమనం వల్ల తుల రాశి వారికి ప్రయోజనకరంగా ఉండదు. ఈ సమయంలో మీరు మీ శత్రువుల నుంచి అప్రమత్తంగా ఉండాలి. మీ వ్యక్తిగత విషయాలను అందరితో పంచుకోవడం మానుకోండి. మానసిక ఒత్తిడి ఉండవచ్చు. అనవసర ఖర్చులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు.

* మకర రాశి : మకర రాశికి అధిపతి శని దేవుడు. బృహస్పతి గ్రహం యొక్క వక్ర గమనం వల్ల మకర రాశి వారికి చేసే పనుల్లో ఆటంకాలు ఎదురు కావచ్చు. ఈ సమయంలో, మీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం ద్వారా డబ్బును కోల్పోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వ్యాపారులు డబ్బు విషయంలో అప్రమత్తంగా ఉండాలి.