Suicides:ఆత్మహత్యలకు సంబంధించి తాజాగా ఓ అధ్యయనంలో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. పౌర్ణమి రోజుల్లో ఆత్మహత్యలు ఎక్కువ చోటుచేసుకుంటున్నాయని రీసెర్చ్‌లో తేలింది. దీనికి సంబంధించి డిస్కవర్ సెంటర్ హెల్త్ జర్నల్‌లో ఓ కథనం ప్రచురితమైంది. ఇండియానా యూనివర్సిటీలో స్కూల్ ఆఫ్ మెడిసిన్‌లో పీహెచ్‌డీ అలెగ్జాండర్ నికులెస్కు ఆత్మహత్యలపై అధ్యయనం చేశాడు.
ఏ రోజు, ఏ సమయం, ఏ నెలలో ఎక్కువ ఆత్మహత్యలు జరుగుతున్నాయనే విషయంపై రీసెర్చ్ చేశారు. ఈ అధ్యయనంలో సంచలన విషయాలు బయటపడ్డాయి. మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల సమయంలో ఎక్కువగా ఆత్మహత్యలు జరుగుతున్నాయట. అలాగే సెప్టెంబర్ నెలలో ఆత్మహత్యలు ఎక్కువగా చేసుకుంటున్నారట. అలాగే పౌర్ణమి రోజుల్లో ఎక్కువమంది బలవన్మరణాలకు పాల్పడుతున్నట్లు రీసెర్చ్‌లో తేలింది.
2012 నుంచి 2016 మధ్య కాలంలో జరిగిన ఆత్మహత్యలను పరిశీలించారు. దీంతో పౌర్ణమి సంభవించే వారంలో అధికంగా ఆత్మహత్యలు నమోదైనట్లు గుర్తించారు. డిప్రెషన్,ఆందోళన, పోస్ట్ ట్రమాటిక్ స్ట్రేస్ డిజార్డర్, నొప్పి, మానసిక సమస్యల వల్ల ఎక్కువమంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. పౌర్ణమి సమయాల్లో ఆత్మహత్యలు పెరగడానికి కారణంపై కూడా పరిశోధణలు జరిపారు. చంద్రుడి కాంతి ఆత్మహత్యలకు ప్రేరేపిస్తోందని చెబుతున్నారు.సెప్టెంబర్ నెలలో పగటి వెలుతురు తగ్గడం వల్ల సీజనల్ ఎఫెక్టివ్ డిజార్టర్ ను ప్రజలను అనుభవిస్తారని, దీని వల్ల ఆత్మహత్యల ఆలోచన వస్తున్నట్లు తేల్చారు.
మానవుడి శరీరంలో సిర్కాడియన్ అనే ఇంటర్నర్ క్లాక్ ఉంటుంది. మానవ మెదడులోని హైపోథాలమస్ భాగంలో ఉండే ఈ వ్యవస్థ మన ఆలోచనలను ప్రభావితం చేస్తోంది. పౌర్ణమి సందర్భంగా కాంతిలో వచ్చే మార్పల వల్ల మనుషుల్లో వేరే ఆలోచనలు వస్తున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.సిర్కాడియన్ క్లాక్ విషయంపై మరిన్ని పరిశోధనలు చేస్తున్నట్లు చెబుతున్నారు.త్వరలో మరిన్ని వివరాలు బయటపెడతామని సైంటిస్టులు చెబుతున్నారు.