‘Lord Hanuman visits Ram Lalla’ : అయోధ్య రామమందిరానికి వచ్చిన హనుమంతుడు..సంబరాల్లో భక్తులు

  • Written By:
  • Publish Date - January 24, 2024 / 02:19 PM IST

అయోధ్య (Ayodhya) లో రామ మందిరం ప్రారంభం కావడం తో భక్తులే కాదు వానర సైన్యం (Monkey) కూడా రాముడ్ని చూసేందుకు పోటీ పడుతున్నాయి. ఆనాడు..రాముడి వెంట ఎలాగైతే నడిచాయో…ఇప్పుడు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న రాముడి గురి కట్టడం తో ఆ గుడిలో ఉన్న రాముణ్ణి చూసేందుకు మీము కూడా అంటూ భక్తులతో పాటు అవి కూడా లోనికి వచ్చి రామయ్య దర్శనం చేసుకుంటున్నాయి.

అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ట (Ram Mandir Pran Prathistha) కార్యక్రమం సోమవారం ప్రధాని నరేంద్రమోదీ (PM Modi) చేతుల మీదుగా అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా ఉన్న ఎంతో మంది ప్రముఖులు హాజరయ్యారు. ప్రాణప్రతిష్ఠ పూర్తయిన తర్వాత ఫోటోలు, వీడియోలు ఇలా ఎన్నో బయటికి వచ్చాయి. ఈ ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం వరల్డ్ వైడ్ గా చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అయోధ్య లో ఏంజరిగిన..అది వార్తల్లో హైలైట్ అవుతుంది. నిన్నటికి నిన్న అయోధ్య రాముడు కళ్లు తెరిచాడంటూ ఓ వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. ఆ వీడియోలో ఉన్న బాలరాముడిని చూస్తే అది విగ్రహం కాకుండా ప్రత్యక్షంగా ఒక మనిషిని చూసినట్లే కనిపిస్తోంది. బాలరాముడు కళ్లు తెరిచి అటు ఇటు చూస్తున్నట్లు (Ram Lalla’s Idol ‘blinking eyes’) కనిపించింది. అంతే కాదు చిరునవ్వుతో కంటి రెప్పలు కొడుతూ తలను అటూ ఇటూ కదిలిస్తూ చూస్తున్నట్లు వీడియో లో ఉండడం తో ఈ వీడియో చూసిన వారంతా షేర్ చేస్తూ వైరల్ గా మార్చేశారు.

We’re now on WhatsApp. Click to Join.

అలాగే నిన్న మంగళవారం సాయంత్రం ఒక వానరం గర్భగుడిలోకి ప్రవేశించింది. రాముడి ఉత్సవ విగ్రహం దగ్గరకు వెళ్లిందని శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్రం తెలిపింది. సామాన్య భక్తులకు దర్శన భాగ్యం కల్పించిన తొలి రోజున జరిగిన ఈ అనూహ్య ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఆ హనుమంతుడు స్వయంగా రామ్‌లల్లా దర్శనానికి వచ్చినట్టుగా అనిపిస్తోందని భక్తులు చెపుతూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్నీ ట్రస్ట్ ట్విట్టర్ వేదికగా పంచుకుంది.

‘‘ వానరాన్ని గమనించిన భద్రతా సిబ్బంది ఉత్సవ విగ్రహం నేలపై పడిపోతుందేమోనని ఆందోళన చెంది అటువైపుగా పరిగెత్తారు. అయితే, పోలీసులు అక్కడికి చేరుకోగానే వానరం ప్రశాంతంగా ఉత్తర ద్వారం వైపు వెళ్లింది. గేటు మూసి ఉండడంతో తూర్పు వైపునపు వెళ్లి జన సామూహాన్ని దాటుకొని ఎవరికీ ఇబ్బంది కలిగించకుండా బయటకు వెళ్లిపోయింది. రామ్ లల్లాలను దర్శించుకోవడానికి ఆ భగవంతుడి వచ్చినట్టుగా ఉందని భద్రతా సిబ్బంది అంటున్నారు’’ అని ఆలయ ట్రస్ట్ పేర్కొంది.

Read Also : Mamata Banerjee : కాంగ్రెస్ పార్టీ కి బిగ్ షాక్ ఇచ్చిన మమతా బెనర్జీ