కొన్ని కొన్ని సార్లు మనం ఆర్థికంగా ఎదుర్కొనే ఇబ్బందులకు వాస్తు విషయాలు కూడా కారణం కావచ్చు. వాస్తు ప్రకారంగా అనేక విషయాలను పాటించడం వల్ల ఆర్థికంగా కూడా కలిసి వస్తుందని చెబుతున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు. వాస్తు ప్రకారం నడుచుకుంటే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి సంతోషంగా ఉండవచ్చట. వాస్తు విషయాలను పాటించడం వల్ల ప్రతికూల శక్తులు తొలగిపోయి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి ఇంట్లో డబ్బు ఉంటుందట. మరి అందుకోసం ఏం చేయాలి ఎటువంటి పరిహారాలు పాటించాలి అన్న విషయానికి వస్తే.. చాలా మంది ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఉంటారు.
ఆర్థిక సమస్యల నుంచి బయటపడడానికి కొన్ని పరిహారాలని పాటించడం మంచిది. ఈ పరిహారాలని కనుక పాటించినట్లయితే ఆర్థిక ఇబ్బందులు లేకుండా సంతోషంగా ఉండవచ్చట. చాలా మంది ఆర్థిక ఇబ్బందులు కలగకుండా ఉండడానికి వాస్తు ప్రకారం అనుసరిస్తూ ఉంటారు. వాస్తు ప్రకారం నడుచుకుంటే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి సంతోషంగా ఉండవచ్చట. అలాగే వాస్తు ప్రకారం అనుసరించడం వలన ఇంట్లో సానుకూల శక్తి ప్రవహిస్తుంది. ప్రతికూల శక్తి కూడా తొలగిపోతుందట. మరి అందుకోసమే ఏం చేయాలి అన్న విషయానికొస్తే.. ఇంటిని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలట. ఇల్లు శుభ్రంగా ఉంటే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. ఇంట్లో చెత్త చెదారం, పనికిరాని సామాన్లు, విరిగిపోయిన వస్తువులు లాంటివి ఉండకూడదట. అలాగే ఆగ్నేయం వైపు చెత్త చెదారం అస్సలు ఉండకూడదని చెబుతున్నారు.
ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉన్నవారు ఇంట్లో మనీ ప్లాంట్ మొక్కను పెట్టుకోవాలని చెబుతున్నారు. మనీ ప్లాంట్ మొక్క ఇంట్లో ఉండడం వల్ల ఆర్థిక ఇబ్బందుల నుంచి ఈజీగా బయటపడవచ్చట. అలాగే సంతోషంగా కూడా ఉండవచ్చట. ఆగ్నేయం వైపు మనీ ప్లాంట్ ని ఉంచడం వలన సానుకూల శక్తి కలిగి, ప్రతికూల శక్తి తొలగిపోతుందట. తద్వారా సంతోషంగా ఉండవచ్చని చెబుతున్నారు. ఆర్థిక బాధల నుంచి కూడా సులువుగా బయటపడవచ్చని చెబుతున్నారు. అలాగే ఇంటి ముఖ ద్వారం దగ్గర లాఫింగ్ బుద్ద పెడితే కూడా ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి సంతోషంగా ఉండవచ్చట. కనుక ఒక లాఫింగ్ బుద్ధని ఇంట్లో ముఖద్వారం వద్ద ఉంచడం మంచిదని చెబుతున్నారు.
అలాగే మీకు ఉన్నంతలో తోచినంత పేదవాళ్ళకి, లేని వాళ్లకు బట్టలు ఆహారం డబ్బులు వంటి విధానం చేయవచ్చని చెబుతున్నారు. ఇలాంటివి ధానం చేయడం వల్ల కూడా ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడవచ్చట. ముఖ్యంగా గురువారం రోజు గానీ పౌర్ణమి రోజు కానీ పేదలకు దానం చేయడం మంచి ఫలితాలను ఇస్తుందని చెబుతున్నారు. సూర్యదేవునికి నీళ్లు సమర్పిస్తే ఆర్థిక సమస్యల నుంచి బయటపడవచ్చట. ఆర్థిక బాధలతో సతమతమవుతున్న వాళ్ళు ఓం శ్రీ మహాలక్ష్మీ నమః అన్ని 108 సార్లు జపిస్తే కూడా చక్కటి ఫలితం ఉంటుంది. ఓం యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్య పతయే ధన ధాన్య సమృద్ధి దపాయ స్వాహా అని 108 సార్లు శుక్రవారం నాడు చదివితే మంచి ఫలితాలు ఉంటాయని, ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగిపోతాయని చెబుతున్నారు.