Site icon HashtagU Telugu

Money Plant: మనీ ప్లాంట్ నాటుతున్నారా.. అయితే ఈ వాస్తు నియమాలను పాటించాల్సిందే?

Money Plant

Money Plant

చాలామంది ఇంటిని అందంగా అలంకరించుకోవడానికి ఇంట్లో రకరకాల మొక్కలను పెంచుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే ఇంటిని రకరకాల పూల మొక్కలతో అలంకరిస్తూ ఉంటారు. కొందరు మాత్రం వాస్తుశాస్త్ర ప్రకారంగా కొన్ని మొక్కలు మాత్రమే నాటుతూ ఉంటారు. ఇంట్లో మొక్కలు ఉండటం వల్ల మనసుకు ఆహ్లాదకరంగా అనిపించడంతో పాటు ప్రశాంతంగా ఉంటుంది. కాగా ప్రస్తుత రోజుల్లో చాలామంది ఇళ్లలో మనీ ప్లాంట్ మొక్కను పెంచుకుంటున్న విషయం తెలిసిందే. ఇండోర్, అవుట్ డోర్ లలో మొక్కను ఎక్కువగా పెంచుకుంటూ ఉంటారు. మనీ ప్లాంట్ మొక్కను లక్ష్మి దేవి స్వరూపంగా భావిస్తారు.

ఆ మొక్క ఎంత ఏపుగా పెరిగితే మన సంపద కూడా అంత బాగా పెరుగుతుందని నమ్ముతూ ఉంటారు. ఆర్థిక ఇబ్బందులతో బాధపడేవారు మనీ ప్లాంట్ మొక్కను పెంచుకోవడం వల్ల మంచి జరుగుతుందని భావిస్తూ ఉంటారు. మనీ ప్లాంట్ మొక్కను ఇంట్లో పెంచుకోవడం మంచిదే కానీ కొన్ని రకాల నియమాలు పాటించడం తప్పనిసరి. మనీ ప్లాంట్ నాటడానికి ముందు వాస్తు నియమాలు తెలియకపోతే ధన నష్టం తప్పదు. ఆ నియమాలు ఏంటి అన్న విషయానికి వస్తే.. ఈ మొక్కను ఆగ్నేయ దిశలో మనీ ప్లాంట్‌ను నాటాలి. ఎందుకంటే ఈ మొక్క శుక్రునికి కారకం. ఇంటి ప్రాంగణంలో ఖాళీ ప్రదేశం వుంటే మనీ ప్లాంట్‌ను కుండీలో కాకుండా స్థలంలో నాటాలి. అలాగే మనీ ప్లాంట్ ఈశాన్యంలో నాటకూడదు.

ఎందుకంటే ఈ దిశను బృహస్పతి గ్రహంగా పరిగణిస్తారు. మనీ ప్లాంట్ అనేది శుక్రుని మొక్క, కాబట్టి దాని శత్రు గ్రహాలైన మార్స్, మూన్, సన్ ప్లాంట్‌ల దగ్గర నాటకూడదు. ఎప్పుడు అయినా మనీ ప్లాంట్ ఆకులు ఎండిపోతే వెంటనే ఆ ఎండుటాకులను వెంటనే తొలగించాలి. అదేవిధంగా మనీ ప్లాంట్‌లో ఆకులు ఎప్పుడు నేలను తాకకూడదు. ఎందుకంటే ఇది ఆనందం, శ్రేయస్సు, విజయానికి ఆటంకం కలిగిస్తుంది. ఈ మొక్క తీగలను పైకి లేదా సమాంతరంగా ఉండేలా చూసుకోవాలి. కిందకి వేలాడే తీగలు ఉండకూడదు.