Monday: సోమవారం రోజు ఇలా చేస్తే చాలు.. కష్టాలు సుడిగుండంలో నుంచి బయట పడటం ఖాయం?

  • Written By:
  • Updated On - February 22, 2024 / 04:32 PM IST

వారంలో సోమవారం రోజు శివుడికి అత్యంత ప్రీతికరమైన రోజు. సోమవారం శివుడికి అంఖితం చేయబండింది. శివుడి అనుగ్రహం కోసం చాలామంది ప్రత్యేకంగా భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తూ అనేక రకాల పరిహారాలు కూడా పాటిస్తూ ఉంటారు. అయితే వాటితో పాటుగా ఇప్పుడు మేము చెప్పబోయే పనులు చేస్తే తప్పకుండా ఆ పరమేశ్వరుడి అనుగ్రహం కలగడంతో పాటు మీకున్న కష్టాలు తొలగిపోయి సంతోషంగా జీవించవచ్చు. మరి అందుకోసం సోమవారం రోజు ఎటువంటి పనులు చేయాలి అన్న విషయానికి వస్తే..

సోమవారం నాడు శివుడిని పూజించడం వల్ల, ఉపవాస దీక్షను ఆచరించడం వల్ల మంచి ఫలితం లభిస్తుంది. శివుడిని నిష్టతో పూజించి, సోమవారం నాడు ఈ పనులు చేస్తే దరిద్రం తొలగిపోయి, ఆర్థిక ఇబ్బందులు తొలగి, ఐశ్వర్యవంతులవుతారట. సోమవారం నాడు శివుడికి అత్యంత భక్తిశ్రద్ధలతో పూజాధికాలు నిర్వహించేవారు శుభ్రంగా తల స్నానం చేసి పార్వతీ పరమేశ్వరులపై మనసు లగ్నం చేసి పూజ చేయాలి. అభిషేక ప్రియుడైన శివుడికి అభిషేకం చేసి, బిల్వపత్రాలను సమర్పిస్తే శివయ్యకు ఎంతో సంతోషం కలుగుతుంది. కాబట్టి శివుడికి అభిషేకం చేసి శివ అష్టోత్తరం చదువుతూ విభూదిని సమర్పించి పూజలు చేయాలి. ఆపై శివునికి నైవేద్యంగా నేతితో తాలింపు వేసిన దద్దోజనం సమర్పించాలి.

ఇలా ప్రతి సోమవారం అత్యంత భక్తితో పూజలు చేసి శివుడికి దద్దోజనం సమర్పించడం వల్ల ఆర్థికపరమైన సమస్యలు తొలగిపోయి ఐశ్వర్యవంతులు అవుతారు. అలాగే రుణ బాధలు కూడా తీరుతాయి. కాగా మూడు ఆకులు ఉన్న బిల్వపత్రం శివుడి మూడు కళ్ళకు చిహ్నం. అంతేకాదు త్రిశూలానికి కూడా సంకేతం. బిల్వపత్రాన్ని శివునికి సమర్పించడం వల్ల దరిద్రం తొలగిపోతుంది. శివుడు భక్తవ శంకరుడు, బోళా శంకరుడు, నిష్టతో కొలిస్తే ఎటువంటి వారినైనా కనికరిస్తాడు. అటువంటి పరమశివుడికి ఏది నైవేద్యంగా సమర్పించినా స్వీకరిస్తాడు. కానీ శివుడికి ప్రీతికరమైనది వెలగపండు. ఇది దీర్ఘాయుష్షును సూచిస్తుంది. ఈ పండును స్వామికి సమర్పించడం వల్ల అంతా మంచే జరుగుతుంది. ఆయుష్షు పెరుగుతుంది. అందుకే శివుడిని పూజించేవారు, ముఖ్యంగా సోమవారం నాడు శివ పూజలు చేసేవారు ఈ విధంగా శివుడిని పూజిస్తే ఆర్థికంగా ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోయి సంతోషంగా జీవితాన్ని సాగిస్తారు.