Monday: పొరపాటున కూడా సోమవారం రోజు ఈ పనులు అస్సలు చేయకండి.. అవేంటంటే?

మామూలుగా సోమవారం రోజున పరమేశ్వరునికి భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తూ ఉంటాం. ఆయన అనుగ్రహం కలగాలని ఉపవాసాలు ఉండడంతో పాటు ఆయనకి ఇష్ట

  • Written By:
  • Updated On - February 22, 2024 / 09:14 PM IST

మామూలుగా సోమవారం రోజున పరమేశ్వరునికి భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తూ ఉంటాం. ఆయన అనుగ్రహం కలగాలని ఉపవాసాలు ఉండడంతో పాటు ఆయనకి ఇష్టమైన నైవేద్యాలను బిల్వపత్ర ఆకులను వంటి వాటిని సమర్పిస్తూ ఉంటారు.. అయితే ఇవి చేయడంతో పాటు సోమవారం తెలిసి తెలియకుండా కొన్ని రకాల తప్పులను అస్సలు చేయకూడదు. అలా చేయడం వల్ల ఆ పరమేశ్వరుడి ఆగ్రహానికి గురికాక తప్పదు. మరి సోమవారం రోజు ఎలాంటి పనులు చేయకూడదు ఇప్పుడు మనం తెలుసుకుందాం.. సోమవారం నాడు ధాన్యం కొనుగోలు చేయడం మానుకోవాలని, చదువులకు సంబంధించిన పుస్తకాలు, నోటు పుస్తకాలు, పెన్నులు వంటివి కొనడం సరికాదు.

అంతేకాదు ఆట వస్తువులను, వాహనాలను, ఎలక్ట్రిక్ గాడ్జెట్స్ ను పొరపాటున కూడా సోమవారం నాడు కొనుగోలు చేయకూడదు. సోమవారం నాడు ఈ వస్తువును కొనుగోలు చేయడం ఆశుభమైందిగా పరిగణించబడుతుంది. పొరపాటున సోమవారం నాడు తెలియక ఎవరైనా ఇటువంటి వస్తువులను కొనుగోలు చేస్తే అవి ఎక్కువ కాలం మన్నికగా ఉండవు. సోమవారం నాడు కొన్ని వస్తువులను కొనుగోలు చేయడం వల్ల శుభ ఫలితాలు కూడా వస్తాయి. అలాగే ఇంటికి తెల్లటి వస్తువులను తీసుకురావడం వల్ల ఆ ఇంట్లో సుఖ సంతోషాలు ఉంటాయి. చక్కెర, బియ్యం వంటి పదార్ధాలు తెచ్చుకోవచ్చు. సోమవారం నాడు తెల్లని వస్త్రాలు ధరించడం వల్ల జాతకంలో చంద్రుడి స్థానం బలోపేతం అవుతుంది.

మన జాతక కుండలిలో చంద్రుని బలోపేతం చేయడానికి సోమవారం అనుకూలమైన రోజు అని చెబుతున్నారు. ఇక సోమవారం నాడు తెల్లని వస్తువులను దానం చేయడం వల్ల, తెల్లని వస్తువులను తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. సోమవారం రోజు శివుడిని నిష్టగా అభిషేకించి,పూజించి, శివలింగానికి పాలు సమర్పించడం వల్ల ఆ శివుడి ఆశీర్వాదం తప్పక దొరుకుతుంది.