హిందువులు ఎక్కువ పూజించే దేవుళ్లలో పరమేశ్వరుడు కూడా ఒకరు. పరమేశ్వరుడిని సోమవారం రోజు పూజిస్తారు. త్రిమూర్తులలో లయకారుడైన శివుడికి సోమవారం అంకితం చేయబడింది. దీనితో పాటు సోమవారం చంద్రుడికి సంబంధించిన రోజు కూడా. సోమవారం రోజున అత్యంత భక్తిశ్రద్ధలతో పరమేశ్వరుని పూజించి ఆయనను ఆరాధించడం వల్ల ప్రత్యేక ఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. అలాగే సోమవారం రోజున కొన్ని పరిహారాలు చేయడం వల్ల జీవితంలో సానుకూలత, విజయం, స్థిరత్వం లభిస్తాయి. అలాగే గ్రహాల స్థానం కూడా బాగుంటుందట. మీరు కూడా మీ జీవితంలో ఆనందం, శాంతి, శ్రేయస్సు కోరుకుంటే, సోమవారం రోజున ఖచ్చితంగా ఈ పరిహారాలను ప్రయత్నించాలని చెబుతున్నారు. ఆ పరిహారాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
సోమవారం శివలింగానికి పాలతో అభిషేకం చేయడం చాలా పవిత్రమైనది అని చెప్పాలి. శివలింగానికి ఆవు పాలతో చేసే అబిషేకం వలన జీవితంలో వచ్చే అడ్డంకులు తొలగిపోతాయట. ఆవు పాలలో కొద్దిగా తేనె లేదా చక్కెర కలిపి శివలింగానికి సమర్పించవచ్చని చెబుతున్నారు. అలాగే సోమవారం రోజున పేదలకు లేదా అవసరంలో ఉన్నవారికి పాలు లేదా ఆహారాన్ని దానం చేయాలట. ఇలా చేయడం వల్ల జాతకంలో చంద్ర దోషం ఉంటే చంద్రుని శుభ ప్రభావం పెరుగుతుందట. అలాగే నవ గ్రహాల చెడు స్థానం మెరుగుపడుతుందని చెబుతున్నారు. సోమవారం ఖచ్చితంగా శివలింగానికి బిల్వ పత్రాలను సమర్పించాలట. ఇలా చేయడం వల్ల అన్ని కోరికలు నెరవేరుతాయని, ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుందని పండితులు చెబుతున్నారు.
అలాగే శివయ్యకు బిల్వ పత్రాలు వేసిన నీరు సమర్పించడం వలన ఇంట్లో ఎప్పుడూ ఆర్థిక సంక్షోభం ఉండదట. సోమవారం ఉపవాసం ఉండటం అత్యంత ముఖ్యమైనదని, ఇది ఆర్దికంగా ప్రయోజనకరమైనదిగా పరిగణించబడుతుందని చెబుతున్నారు. ఈ రోజున ఉపవాసం ఉండడం వల్ల శరీరం, మనస్సు శుద్ధి అవుతాయట. అలాగే శివుని ఆశీస్సులు కూడా లభిస్తాయట. సోమవారం ఉపవాసం ఆర్థిక సంక్షోభం, మానసిక ఒత్తిడి, ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుందని చెబుతున్నారు. కాబట్టి సోమవారం రోజు ఈ విధమైన పరిహారాలు పాటిస్తే తప్పకుండా మంచి ఫలితాలు కలిగి ఆర్థిక సమస్యల నుంచి కూడా బయటపడవచ్చు అని చెబుతున్నారు.