Site icon HashtagU Telugu

Astrology : సోమవారం ఉపవాసం ఉంటున్నారా? అయితే ఈ తప్పులు అస్సలు చేయకండి..!!

Lord Siva

Lord Siva

సోమవారం అంటే ఆ భోళాశంకరుడికి ఎంతో ప్రీతికరమైన రోజు. శివుడిని భక్తులు సోమవారం కొలుస్తారు. చాలామంది భక్తులు ఈరోజు ఉపవాసం ఉంటూ ఆ పరమేశ్వరుడి ఆశీర్వాదాలు పొందుతారు. మీకు వీలైతే సోమవారం తెల్లవారుజామునే స్నానం చేసి శివాలయానికి వెళ్లి ఆ పరమేశ్వరుడి ఆశీస్సులు తీసుకోండి. ఇంట్లో శివుడి విగ్రహం, ఫొటోకు పూజ చేయండి. సోమవారం నాడు ఉపవాసం ఉండటంతోపాటు…వస్త్రాలు, ఆహారం దానం చేస్తే ఆ పరమేశ్వరుడి కరణ మీపై తప్పకుండా ఉంటుంది. ఇలా సోమవారం నాడు శివుణ్ని పూజిస్తే మీరు ఆశించిన ఫలితాలు తప్పకుండా వస్తాయి. శివుడు ఆశీస్సులు మీరు చేపట్టిన అన్ని పనులను విజయవంతంగా పూర్తయ్యేలా చేస్తాయని వేదాంతాలు చెబుతున్నాయి.

సోమవారం నాడు ఉపవాసాలు మూడు రకాలుగా ఉంటాయి.
1. ప్రతిసోమవారం ఉపవాసం, 2. సోమ ప్రదోష వ్రత పూజ 3. 16 రోజుల సోమవారం వ్రత పూజ

ఉపవాసంలో ఈ తప్పులు అస్సలు చేయకండి.
రాగిపాత్రలో పాలు పోసి పరమేశ్వరుడికి అభిషేకం చేయకూడదు. రాగి పాత్రలో పాలు పోయడం స్వామివారికి అయిష్టమట. శివలింగంపై చందనం వేసి అభిషేకించాలి. అయితే దానిపై కుంకుమ, పసుపు ఎట్టిపరిస్థితుల్లో వేయరాదు. సోమవారం వ్రతం పాటించేవారు తెల్లనివస్తువులను దానం చేయరాదు. సోమవారం పూజ చేసే వ్యక్తి కుంకుమ, పసుపు, ఎరుపు రంగు దుస్తువులను ధరించాలి. పూజలో నల్లని వస్త్రాలు ఉపయోగించకూడదు. ఇక సోమవారం నాడు ఉత్తరం, తూర్పు దిశలో ప్రయాణం చేయకూడదు.

 

 

 

Exit mobile version