Jambukeswarar Akilandeswari Temple: హిందూ ఆలయాలకు ప్రసిద్ధి చెందిన ప్రాంతం తమిళనాడు. పురాతణమైన అలయాలు ఉన్న రాష్ట్రం. వేల సంవత్సరాల క్రితం నిర్మించిన ఆలయాలు ఇక్కడ దర్శనమిస్తాయి. దేశ, విదేశాల నుంచి పర్యాటకులు ఈ ఆలయాల దర్శనార్ధం ఏడాది పొడువునా వస్తుంటారు. ఇక్కడ ఒక్కో గుడికి ఒక్కోకరమైన చరిత్ర ఉంది. అలాగే తిరువానైకల్‌లోని అఖిలాండేశ్వరి ఆలయానికి ఓ చరిత్ర ఉంది. అయితే ఈ ఆలయం నెట్టింట వైరల్‌గా మారింది. ఈ దేవాలయానికి చెందిన ఓ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
తిరువానైకల్ తమిళనాడులోని ఐదు ప్రధాన శివాలయాల్లో ఒకటి. ప్రతి ఒక్కటి మహ్భతా లేదా ఐదు గొప్ప అంశాలలో ఒక దానిని సూచిస్తుంది. ఈ ఆలయం తమిళంలో నీరు లేదా నీర్‌ని సూచిస్తుంది. నీటిని బయటకు పంపుతున్నప్పటికీ, జంబుకేశ్వరుని గర్భగుడిలో ఇప్పటికీ నీటితో నిండిన భూగర్భ జల ప్రవాహం ఉంది. జంబుకేశ్వర దేవాలయం చోళుల కాలం నాటి శాసనాలు కూడా కనిపిస్తాయి. ఈ చరిత్ర అంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు నెట్టింట ఉన్న వీడియో మరో లెవెల్.
జంబుకేశ్వర అఖిలాండేశ్వరి ఆలయంలో అపురూప దృశ్యం చోటుచేసుకుంది. అఖిల అనే ఏనుగు ఆలయ భారీ ద్వారాలను స్వయంగా తెరచుకొని గంభీరంగా వచ్చింది. బుధవారం జరిగిన ఈ ఘటనను ఆలయ నిర్వాహకులు వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది.