Site icon HashtagU Telugu

Milk: కలలో మీకు అలా పాలు కనిపిస్తే మీకు అదృష్టం పట్టినట్టే.. కానీ ఇలా అస్సలు కనిపించకూడదు?

Mixcollage 09 Feb 2024 08 06 Am 937

Mixcollage 09 Feb 2024 08 06 Am 937

మామూలుగా మనం నిద్రపోతున్నప్పుడు ఎన్నో రకాల కలలు వస్తూ ఉంటాయి. అందులో కొన్ని మంచి కలలు అయితే మరి కొన్ని చెడ్డ కలలు. స్వప్న శాస్త్ర ప్రకారం కలలు మన భవిష్యత్తును సూచిస్తాయి. అంతేకాకుండా కలలో ఒక్కొక్క కలకు ఒక విధమైన కారణం ఉంటుంది. అయితే మామూలుగా చాలామందికి కలలో పాలు కనిపిస్తూ ఉంటాయి. పాలు తాగుతున్నట్టు, పాలు కింద పడిపోయినట్టు ఇలా రకరకాలుగా కనిపిస్తూ ఉంటాయి. మరి నిజంగా కలలో పాలు కనిపించడం మంచిదేనా? అలా కనిపిస్తే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

చాలామందికి కలలో పాలు మరుగుతున్నట్లు కనిపిస్తాయి. ఇలా కనిపిస్తే అది సంతోషకరమైన భవిష్యత్తును సూచిస్తుంది. కాగా స్వప్న శాస్త్రం ప్రకారం మీరు త్వరలో కెరీర్లో మంచి పురోగతి సాధిస్తారు అని అర్థం. చాలామందికి కలలో పాలు పోసినట్లుగా కనిపిస్తుంది. కలలో పాలు పోసినట్టు రావడం మంచిది కాదు. అలా కల వస్తే జీవితంలో త్వరలో ఏదైనా సంక్షోభం రాబోతున్నదని అర్థం. కలలో పాలు పోసినట్టు వస్తే భవిష్యత్తులో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. చాలామందికి కలలో పాల పాత్ర చేతినుంచి పడిపోయినట్టుగా వస్తుంది. అలా పాల పాత్ర చేతిలోనుండి పడిపోయి, పాలు పోయినట్లుగా కల వస్తే మంచిది కాదు.

ఇది అశుభ సంకేతంగా బావించాలి. చాలాసార్లు కలలో పాలల్లో చక్కెర వేసి కలుపుతున్నట్లుగా వస్తుంది. దీనిని శుభ సూచన భావించాలి. పాలల్లో పంచదార వేసి కలుపుతున్నట్లుగా వస్తే సంతోషకరమైన భవిష్యత్తుకు చిహ్నంగా చెప్పవచ్చు. భవిష్యత్తులో మంచి జరుగుతుందని ఈ కల సూచిస్తుంది. చాలామందికి కలలో పాలు తాగినట్టుగా కనిపిస్తుంది. పాలు తాగడం చూస్తున్నట్లుగా కూడా కల వస్తుంది. ఈ కల వల్ల కూడా మంచి జరుగుతుంది. ఇలా కల వస్తే పురోగతికి మార్గం సుగమం అవుతుందని, భవిష్యత్తులో మంచి జరుగుతుందని అర్థం. ఇక కలలో పాలు విరిగి పోయినట్టుగా కనిపిస్తే అశుభ సూచకంగా బావించాలి.