Site icon HashtagU Telugu

TTD : అద్భుతం.. కాఫీ పౌడర్‌తో 50 అడుగుల.. !

TTD

TTD

తిరుమలకు చెందిన పల్లి చిరంజీవి మైక్రో ఆర్టిస్ట్ త‌న భక్తిని చాటుకున్నాడు. 50 అడుగుల పొడవు, 30 అడుగుల వెడల్పు క్లాత్‌పై కాఫీ పౌడర్‌తో వేంకటేశ్వరస్వామి చిత్రాన్ని వేసిన తిరుమల యువకుడి పేరు వండర్‌ బుక్‌ ఆఫ్‌ రికార్స్ట్‌లో నమోదయింది.చిరంజీవి బియ్యపు, చింతగింజలపై జాతీయ పతాకం, జాతీయ నేతలు, శ్రీవారు, అమ్మవార్ల బొమ్మలు వేసి పేరు పొందాడు. ఈ నెల 27నుంచి ప్రారంభం కానున్న బ్రహ్మోత్సవాల సందర్భంగా టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యుడు మురంశెట్టి రాములు సూచన మేరకు 50 అడుగుల క్లాత్‌పై కాఫీ పౌడర్‌తో శ్రీవారి చిత్రాన్ని గీశాడు. తిరుపతిలోని ఆర్య నివాస్‌లో 20 రోజుల పాటు ఈ చిత్రాన్ని వేశాడు. ఏడు కొండలకు సూచికగా ఏడు కేజీల కాఫీ పౌడర్‌ను వినియోగించాడు.

Exit mobile version