Medaram Special Buses : మేడారానికి ప్రత్యేక బస్సు సర్వీసులు ప్రారంభం

  • Written By:
  • Publish Date - December 17, 2023 / 05:12 PM IST

మేడారం (Medaram) వెళ్లి భక్తులకు తీపి కబురు తెలిపింది TSRTC . నేటి నుండి మేడారం కు ప్రత్యేక బస్సు సర్వీస్ (Medaram Special Buses) లు ప్రారంభించినట్లు ఆర్టీసీ అధికారులు ప్రకటించారు. ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర గా మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు పేరుంది. ఈ జాతర కు అనేక రాష్ట్రాల నుండి పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని..వారి మొక్కులు తీర్చుకుంటారు. అలాగే ఏడాది పొడుగూతా కూడా భక్తులు అమ్మవార్లను దర్శనం చేసుకుంటుంటారు.

2024 ఫిబ్రవరిలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర జరగబోతుంది. ఈ క్రమంలో TSRTC నేటి నుండే మేడారం కు ప్రత్యేక బస్సు సర్వీస్ లను ప్రారంభించింది. హన్మకొండ బస్టాండ్ నుంచి ప్రతి బుధవారం, ఆదివారం సెలవు దినాల్లో మేడారానికి స్పెషల్ బస్సులు నడపనున్నట్లు వరంగల్ ఆర్టీసీ ఆర్ఎం శ్రీలత తెలిపారు. ఈ రోజుల్లో ప్రతి 45 నిమిషాలకు ఒక స్పెషల్ బస్సు అందుబాటులో ఉంటుందన వివరించారు. భక్తుల రద్దీకి అనుగుణంగా ప్రత్యేక బస్సులు నడపాలని నిర్ణయించినట్లు తెలిపారు. భక్తులు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించి సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని శ్రీలత సూచించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 21 నుంచి 24వ తేదీ వరకు మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతర జరగనుంది. అయితే.. జాతరకు ముందు నుంచే భక్తులు వనదేవతలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటుంటారు. దీంతో.. ఆర్టీసీ అధికారులు ఈ స్పెషల్ బస్సులను నడిపించనున్నట్టు ప్రకటించారు.

We’re now on WhatsApp. Click to Join.

ఇదిలా ఉంటె మేడారం జాతరకు తెలంగాణ ప్రభుత్వం రూ.75 కోట్లు నిధులను విడుదల చేసింది. ముఖ్యంగా తాగునీరు, పారిశుధ్య పనులకు అత్యధికంగా రూ.14 కోట్ల 74లక్షల 90వేలను కేటాయించడం విశేషం.

అలాగే భక్తుల భద్రత కోసం పోలీస్‌ శాఖకు రూ.10కోట్ల 50లక్షలు
రహదారుల మరమ్మతులు, నిర్మాణం కోసం రూ.2 కోట్ల 80లక్షలు
దేవాదాయ శాఖకు రూ.కోటీ50లక్షలు
పంచాయతీరాజ్‌ శాఖకు రూ.4కోట్ల 35లక్షలు
మైనర్‌ ఇరిగేషన్‌కు రూ.6కోట్ల 11లక్షల 70వేలు
వైద్య ఆరోగ్య శాఖకు రూ.కోటి
ఐటీడీఏ ట్రైబల్‌ వెల్ఫేర్‌ ఇంజినీరింగ్‌ శాఖకు రూ.8 కోట్ల 28లక్షల 85వేలు
విద్యుత్‌ శాఖకు రూ.3కోట్ల 96లక్షల 92వేలు
టీఎస్‌ ఆర్టీసీకి రూ.2కోట్ల 25లక్షలు
ఎక్సైజ్‌ శాఖకు రూ.20లక్షలు
సమాచార పౌర సంబంధాల శాఖకు రూ.50లక్షలు
పశు సంవర్థక శాఖకు రూ.30లక్షలు
టూరిజం శాఖకు రూ.50లక్షలు
రెవెన్యూ శాఖకు రూ.5కోట్ల 25లక్షలు
జిల్లా పంచాయతీ అధికారికి శానిటేషన్‌ కోసం రూ.7కోట్ల 84లక్షల 97వేలు
మత్స్యశాఖకు రూ.24లక్షల 66వేలు
అగ్నిమాపక శాఖకు రూ.20లక్షలు
అటవీ శాఖకు రూ.20లక్షలు
ఐసీడీఎస్‌ విభాగానికి రూ.23లక్షలు
ట్రైబల్‌ డెవలప్‌మెంట్‌ విభాగంలో ఐటీడీఏ పీవోకు రూ.4కోట్లను విడుదల చేసినట్లు జీవోలో పేర్కొన్నారు.

Read Also : Kaleshwaram Scam: కాళేశ్వరం విచారణకు హరీష్, కేసీఆర్?